కోదండరామ్ సంగతి చెప్పిన పొన్నాల


కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్యకి ఆ పార్టీ అధిష్టానం అన్యాయం చేసిందనే వార్తలొస్తున్నాయి. పొన్నాల నియోజకవర్గం జనగామని టీజెఎస్ కి కేటాయించింది. ఇప్పుడీ స్థానంలో స్వయంగా కోదండరాం బరిలోకి దిగబోతున్నట్టు చెప్పుకొంటున్నారు. జనగామ జిల్లా ఏర్పాటు కోసం జరిగిన పోరాటంలో కోదండరాం పాల్గొన్నారు. ఇదీగాక, అక్కడ ఆయనకు బంధువర్గం ఉంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ చూచిందిన జనగామ, రామగుండం స్థానాల్లో కోదండరాం జనగామ స్థానాన్ని ఎంచుకొన్నారు అనే ప్రచారం జరుగుతోంది.తాజాగా, ఈ ప్రచారంపై పొన్నాల స్పందించారు. జనగామ స్థానాన్ని అధిష్టానం టీజెఎస్ కేటాయించలేదని, ఇటువంటి ప్రచారం కారణంగా పార్టీకి తీవ్ర నష్టం చేకూరుస్తుందని హెచ్చరించారు. ఒకవేళ నిజంగానే జనగామ స్థానాన్ని టీజె ఎస్ కు కేటాయిస్తే.. ఈ విషయంపై తాను హైకమాండ్ తో మాట్లాడుకొంటానని చెప్పుకొచ్చారు పొన్నాల. మరోవైపు, జనగామా స్థానం టీజె ఎస్ కు ఖరారైనట్టు ఆ పార్టీ వర్గాలు చెప్పుకొంటున్నాయి. జనగామ విషయంలో క్లారిటీ రావాలంటే రేపటి వరకు వెయిట్ చేయాల్సిందే.