టీఆర్ఎస్ అభ్యర్థులకి బీ-ఫారాలు.. ముహూర్తం ఫిక్స్ !
ముందస్తు ఎన్నికలకి వెళ్లిన టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికల ప్రచారంలోనూ ముందుంది. ఇప్పటికే ఆ పార్టీ అభ్యర్థులు ప్రచారంలో నిమగ్నమయ్యారు. వారికి ఆ పార్టీ అధినేత కేసీఆర్ విలువైన సూచనలు చేస్తున్నారు. మంత్రులు కేటీఆర్, హరీష్ రావులు విస్తృతంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. ప్రత్యర్తులపై వీరిద్దరు ఓ రేంజ్ లో విరుచుకుపడుతున్నారు. మరోవైపు, టీవీ ఛానెల్స్ కి ప్రత్యేక ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. నాలుగున్నరేళ్లలో తెరాస ప్రభుత్వం చేసిన అభివృద్ధిని వివరిస్తున్నారు.
త్వరలో కేసీఆర్ కూడా రంగంలోకి దిగనున్నారు. మరో దఫా బహిరంగ సభల్లో పాల్గొనబోతున్నారు. అంతకంటే ముందు అభ్యర్థులకి బీ ఫారాలు పంచబోతున్నారు. ఇందుకోసం మూహూర్తం కూడా ఫిక్స్ చేశారు. ఈనెల 11న అభ్యర్థులతో కేసీఆర్ భేటీ కానున్నారు. ఇప్పటికే ప్రకటించిన 107 అభ్యర్థులతో, మిగిలిన 12 స్థానాలకి అభ్యర్థులని ఆ రోజే ప్రకటించేసి.. అందరికీ ఒకే సారి బీ-ఫారాలు అందించబోతున్నారు. ఫైనల్ గా అభ్యర్థులందరికీ కొన్ని సూచనలు చేసి.. ఎన్నికల సమరంలోకి దూకబోతున్నారు.
మరోవైపు, ‘మహాకూటమి’ సీట్ల సర్థుబాటు కొలిక్కి వచ్చింది. తెలంగాణ టీడీపీ 14, టీజె ఎస్ 8, సీపీఐ 3, ఇతర పార్టీలకి ఒక్క స్థానాన్ని కేటాయించింది కాంగ్రెస్. 3 సీట్లతో అసంతృప్తితో ఉన్న సీపీఐకి ఎన్నికల అనంతరం రెండు ఎమ్మెల్సీ టికెట్స్ ఇచ్చేందుకు అంగీకరించినట్టు సమాచారమ్. ఇక, ఈ నెల 10 మహాకూటమి అభ్యర్థుల తొలి జాబితాని ప్రకటించనుంది. ఆ తర్వాత ఒకట్రెండు రోజుల్లోనే రెండో జాబితాని విడుదల చేయనుంది. ఆ వెంటనే అభ్యర్థులకి బీ-ఫారాలు అందజేసి ఎన్నికల ప్రచారంలో బిజీ కానుంది.