2.ఓ : అక్షయ్ రోల్ మొత్తం లీక్ !

‘2.ఓ’ ఇండియన్ సినిమా స్థాయిని పెంచే సినిమా. ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ వేడుకలో సూపర్ స్టార్ రజనీకాంత్ అన్నమాటలివి. ట్రైలర్ ని చూస్తే అది నిజమే అనిపించింది. హాలీవుడ్ రేంజ్ లో ‘2.ఓ’ టీజర్ అదిరిపోయింది. ట్రైలర్ లో సెల్ ఫోన్స్ మాయమవడం.. దానికి సంబంధించిన విజువల్ ఎఫెక్ట్స్ హైలైట్ గా నిలిచాయి.

సెల్ ఫోన్స్ మాయమవ్వడం అనే లైన్ తోనే ‘2.ఓ’ సినిమా తెరకెక్కిందట. సినిమాలో ఫస్ట్‌ సీన్‌లోనే రేడియేషన్‌ కారణంగా అక్షయ్‌ కుమార్‌ పాత్ర చనిపోతుందట. ఆ తరువాత ఈవీల్‌ పరంగా మారిన అక్షయ్‌ రేడియేషన్‌కు కారణమైన సెల్‌ఫోన్‌లను మాయం చేయటం జరుగుతుందట. ఆ పవర్‌ను ఎదుర్కొనేందుకు చిట్టి (ద రోబో) రంగంలోకి దిగటమే మిగతా కథ అనే ప్రచారం జరుగుతోంది.

సినిమాలో రజనీ-అక్షయ్ మధ్య పోరాట సన్నివేశాలు అదిరిపోయే రేంజ్ లో ఉండనున్నాయట. వాటిని విజువల్ వండర్ గా తెరకెక్కించాడు దర్శకుడు శంకర్. బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ ఇష్టపడీ మరీ చేసిన పాత్ర ఇది. ఇందులో ఆయన నట విశ్వరూపం చూపించబోతున్నాడు. రజనీ, అక్షయ్ ల నటన సినిమాకే హైలైట్ గా ఉండబోతున్నాయని చెబుతున్నారు. కాగా, ఈ నెల 29న 2.ఓ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే.