బన్నీకి ఘనస్వాగతం పలికిన కేరళ ఫ్యాన్స్


స్టయిలీష్ స్టార్ అల్లు అర్జున్ కి కేరళ అభిమానులు ఘన స్వాగతం పలికారు. బన్నీకి కేరళ ప్రభుత్వం నుండి ఆహ్వానం అందిన సంగతి తెలిసిందే. ఈరోజు (నవంబర్ 10) కేరళలోని అలప్పూజా సమీపంలో గల పున్నమడ సరస్సులో నెహ్రు ట్రోఫీ బోట్ రేస్ క్రీడలు ప్రారంభం అయ్యాయి.

ఇందులో భాగంగా బోట్ రేస్ క్రీడలకు బన్నీ గౌరవ అతిథిగా హాజరుకాబోతున్నాడు. కొద్దిసేపటి క్రితమే బన్నీ కేరళ చేరుకొన్నారు. బన్నీతో పాటు ఆయన సతీమణి స్నేహారెడ్డి కూడా కేరళ వెళ్లారు. ఈ సందర్భంగా కేరళ అభిమానులు బన్నీకి ఘన స్వాగతంపలికారు. దానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

ఇక, ‘నా పేరు సూర్య’ తర్వాత బన్నీ మరో సినిమా మొదలెట్టలేదు. విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో తెరకెక్కనున్న బన్నీ సినిమా క్యాన్సిల్ అయ్యింది. ఈ నేపథ్యంలో త్రివిక్రమ్ దర్శకత్వంలో మరో సినిమా చేసేందుకు బన్నీ రెడీ అవుతున్నారు. ఈ సినిమాని డిసెంబర్ లో ప్రారంభించబోతున్నట్టు తెలుస్తోంది.