‘వినయ విధేయ రామ’ టీజర్ 24గంటల్లో.. రికార్డ్ వ్యూస్ !

రామ్ కొ ణి దె ల హవా చూపిస్తున్నాడు. ‘అరేయ్ పందెం పరశురామ్ అయితే ఏంట్రా.. ఇక్కడ రామ్ రామ్ కొ ణి దె ల’ అంటూ ‘వినయ విధేయ రామ’ టీజర్ లో రామ్ చరణ్ అదరగొట్టిన సంగతి తెలిసిందే. ఇప్పుడీ టీజర్ హవా చూపిస్తోంది. 24 గంటల్లోనే 15.1మిలియన్ డిజిటల్ వ్యూస్ ని సొంతం చేసుకొంది. బోయపాటి మార్క్ యాక్షన్ తో టీజర్ అదిరిపోయింది. టీజర్ తో మెగా అభిమానులు పండగ చేసుకొంటున్నారు.

బోయపాటి దర్శకత్వంలో రామ్ చరణ్ నటిస్తున్న తొలి చిత్రమిది. ‘రంగస్థలం’ తర్వాత చరణ్ చేస్తున్న ‘వినయ విధేయ రామ’పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. ఇందులో ‘బద్రీ’లో పవన్ డైలాగ్.. ‘నువ్వు నందా అయితే నాకెంటీ.. ? బద్రీ బద్రినాథ్’ డైలాగ్ మాదిరిగా ‘అరేయ్ పందెం పరశురామ్ అయితే ఏంట్రా.. ఇక్కడ రామ్ రామ్ కొ ణి దె ల’ డైలాగ్ మెగా అభిమానులకి పిచ్చ పిచ్చగా నచ్చేసింది.

ఈ సినిమాలో చరణ్ సరసన కైరా అద్వానీ జతకట్టనుంది. ప్రశాంత్, వివేక్ ఒబెరాయ్ తదితరలు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి దేవిశ్రీ సంగీతం అందిస్తున్నారు. డి వి వి దానయ్య నిర్మాత. ఈ చిత్రాన్ని వచ్చే యేడాది సంక్రాంటి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.