ఇగో లేని స్టార్ అల్లు అర్జున్ !

స్టయిలీష్ స్టార్ అల్లు అర్జున్ ఇగోలేని స్టార్. ఆయనతో పాటు తోటివారు ఎదగాలని కోరుకొనే మంచి వ్యక్తి బన్నీ. ఆ మంచి మనసుతోనే తోటీ హీరోల సినిమాలని ప్రమోట్ చేస్తుంటాడు. విజయ్ దేవరకొండ ‘గీత గోవిందం’ ప్రీ-రిలీజ్ ఫంక్షన్ కి బన్నీ చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు. ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఆదివారం హైదరాబాద్ లో జరిగిన విజయ్ ‘టాక్సీవాలా’ ప్రీ రిలీజ్ వేడుకకి బన్నీ మరోసారి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సినిమా విజయ్ కి విజయాన్ని అందించాలని మనసారా ఆకాంక్షించారు. అదే సమయంలో కొన్ని సూచనలు కూడా చేశారు.

మనవాళ్లు మన పక్కనే ఉండకూడదు. మనతోపాటు ఎదగాలి. నా దగ్గర పదేళ్లు ఉండి కూడా అలానే ఉంటే అతనికి నేనేం చేసినట్టు ? ఏం చేయలేదు అనే ఫీలింగ్‌ నన్ను చంపేస్తుంది. నా దగ్గర ఉన్న ఆఫీస్‌ బాయ్ ఇప్పుడు ప్రొడక్షన్‌ మేజనర్ ని గర్వంగా చెప్పుకొన్నాడు బన్నీ. ఇది నిజమే. టాలెంట్ ఉన్నోళ్లని బన్నీ ఎప్పుడు ఎంకరేజ్ చేస్తుంటాడు. దర్శకుడు బోయపాటి శ్రీనుకి తొలి అవకాశం ఇప్పించింది బన్నీనే. బన్నీ స్వయంగా బోయపాటిని దిల్ రాజు దగ్గరికి తీసుకెళ్లి ‘భద్ర’ సినిమా చేయమని చెప్పాడు. అది సూపర్ హిట్టయింది. బోయపాటి సెటైపోయాడు.

క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ కి కెరీర్ ప్రారంభంలోనూ బన్నీ ఎంతో హెల్ప్ చేశాడట. దాని గురించి సుక్కు ఇప్పటికీ చెప్పుకొంటుంటాడు. ఇక, తన దగ్గర పనిచేసిన బన్నీవాసుని ఏకంగా నిర్మాతని చేశాడు బన్నీ. ఇప్పుడు బన్నీవాసు బన్నీని దేవుడిలా చూసుకొంటాడు. అందుకే అల్లు అర్జున్ ని ఇగో లేని స్టార్ అని పిలుచుకొంటుంటారు. ఇలాంటి స్టార్ మరిన్ని విజయాలు సాధించాలని, ప్రేక్షకులని ఇలాగే అలరించాలని కోరుకొందాం.