అమర్ అక్భర్ ఆంటోనీ’ సెన్సార్ రివ్యూ

శ్రీనువైట్ల – రవితేజ కలిస్తే మాస్ కి పండగే. వీరి కలయికలో వచ్చిన వెంకీ, దుబాయ్ శీను సూపర్ హిట్ గా నిలిచాయి. ముఖ్యంగా రవితేజలోని మాస్ యాంగిల్ ని హైలైట్ చేసిన చిత్రాలివి. వీరి కలయికలో తెరకెక్కిన హ్యాట్రిక్ చిత్రం ‘అమర్ అక్భర్ ఆంటోనీ’. ఈ శుక్రవారం (నవంబర్ 16)న ప్రేక్షకుల ముందుకు రానుంది.

తాజాగా, ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలని పూర్తి చేసుకొంది. ‘యు/ఎ’ సర్టిఫికెట్ ని పొందింది. మాస్, ఫ్యామిలీ, యూత్ ప్రేక్షకులని మెప్పించే అన్నీ అంశాలు సినిమాలో ఉన్నాయన్నది సినిమా చూసిన సెన్సార్ సభ్యుల టాక్. శ్రీను వైట్ల మార్క్ కామెడీ ఉంటూనే.. కథ గ్రిప్పింగ్ గా సాగుతుందట. ఇది కచ్చితంగా ప్రేక్షకులని కిక్ నిస్తుందని చెబుతున్నారు.

ఈ సినిమా ద్వారా ఇలియానా టాలీవుడ్ కి రీ-ఎంట్రీ ఇస్తోంది. సునీల్ కీలక పాత్రలో నటిస్తున్నారు. థమన్ మ్యూజిక్ అందించారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించింది. ఈ సినిమా హిట్టవ్వడం రవితేజ, మరీ ముఖ్యంగా శ్రీనువైట్లకి ఎంతో అవసరం. మరీ.. ‘అఅఆ’ ప్రేక్షకులని ఏ మేరకు మెప్పిస్తుందన్నది చూడాలి.