టీ20 : పాక్’పై భారత్ ఘన విజయం

వరల్డ్ కప్ లో పాక్ పై భారత్ ఘన విజయాన్ని సాధించింది. మహిళల టీ20 ప్రపంచకప్‌లో భాగంగా ఆదివారం పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్‌ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. టాస్ ఓడి మొదటి బ్యాటింగ్ చేసిన పాక్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 133 పరుగులు చేసింది. పాక్‌ బ్యాట్స్‌మెన్ లలో బిస్మా మరూఫ్‌ 53, ,నిదాదార్‌ 52 పరుగులతో రాణించారు.

అనంతరం 134 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌ ప్రారంభించిన భారత మహిళా జట్టు 19 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్నిచేధించింది. ఓపెనర్‌ మంధాన 26, జెమీమా రోడ్రిగ్స్‌ 16, మిథాలి రాజ్‌ 56 పరుగులతో రాణించారు. ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు మిథాలి రాజ్‌కు దక్కింది.

స్కోర్ వివరాలు :

పాకిస్తాన్‌ :

అయేసా జఫర్‌ (సి) వేదా కృష్ణమూర్తి (బి) 0, జవేరియా ఖాన్‌ రనౌట్‌(రాధా యాదవ్‌/పూనం) 17, ఒమామియా సొహైల్‌ రనౌట్‌ (రోడ్రిగ్స్‌) 3, బిస్మా మరూఫ్‌ (సి) వేదా కృష్ణమూర్తి (బి)హేమలత 53, నిదాదార్‌ (సి) హర్మన్‌ ప్రీత్‌ (బి)హేమలత 52, అలియా రియాజ్‌ స్టంప్డ్‌ తాన్యా బాటియా (బి) పూనం 4, నహిదా ఖాన్‌ నాటౌట్‌ 0, సనామీర్‌ స్టంప్డ్‌ తాన్యా బాటియా (బి) పూనం 0, సిడ్రా నవాజ్‌ నాటౌట్‌ 0 ఎక్స్‌ట్రాలు 4, మొత్తం 133/7 (20ఓవర్లు)

బౌలింగ్‌ :
అరుంధతి రెడ్డి 4-1-24-1, రాధాయాదవ్‌ 4-0-26-0, దీప్తి శర్మ 4-0-26-0, హేమలత 4-0-34-2, పూనం యాదవ్‌ 4-0-22-2

భారత్‌ :
మిథాలి రాజ్‌ (సి) నిదాదార్‌ (బి) డి బేగ్‌ 56, స్మృతి మంధాన (సి) ఒమైమా సొహైల్‌ (బి) మరూఫ్‌ 26, జెమీమా రోడ్రిగ్స్‌ సి అండ్‌ బి నిదాదార్‌ 16, హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ నాటౌట్‌ 14, వేదా కృష్ణమూర్తి నాటౌట్‌ 8, ఎక్స్‌ట్రాలు 17 మొత్తం 137/3(19ఓవర్లు)

బౌలింగ్‌ :
డి బేగ్‌ 3-0-19-1, అనమ్‌ అమిన్‌ 3-0-27-0, సనా మీర్‌ 4-0-22-0, నిదాదార్‌ 4-0-17-1, అలియా రియాజ్‌ 2-0-21-0, బిస్మా మరూఫ్‌ 3-0-21-1.