బీజేపీపై సూపర్ స్టార్ అనుమానం

దేశంలో భాజాపాపై వ్యతిరేక పవనాలు మొదలయ్యాయి. మోడీ సర్కార్ ప్రభుత్వ రంగ సంస్థలన్నింటిన్నీ నిర్వీర్యం చేస్తోందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ తో పాటుగా ప్రతిపక్షాలన్నీ కలిసి 2019లో భాజాపాని ఓడించడమే లక్ష్యంగా వ్యూహా రచన చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో సూపర్ స్టార్ రజనీకాంత్ భాజాపాని అనుమానించడం హాట్ టాపిక్ గా మారింది.

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ సైతం రాజకీయాల్లోకి వస్తున్నారు. ఈ మేరకు ఇప్పటికే ప్రకటన కూడా చేశారు. త్వరలోనే పార్టీ జెండా, అజెండాలని రెడీ చేస్తానని తెలిపారు. ఆ ప్రకటన చేసి చాన్నాళ్లయిన రజనీ పొలిటికల్ గా ముందడు వేయడం లేదు. ఐతే, ఆయన ఎన్ డీయే తో కలిసి వెళ్లే అవకాశాలున్నాయనే ప్రచారమూ జరుగుతోంది. భాజపా చేతిలో రజనీ కీలుబొమ్మగా మారారంటూ డీఎంకే ఆరోపించింది. రజనీ వ్యాఖ్యలు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయి.

మంగళవారం బెంగళూరు నుంచి చెన్నై చేరుకున్న రజనీ మీడియాతో మాట్లాడారు. 2019 ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకోనున్నారా? అన్న ప్రశ్నకు తనదైన శైలిలో సమాధానమిచ్చారు. ‘భారతీయ జనతా పార్టీ ప్రమాదకరమైనదని ప్రతిపక్షాలు భావిస్తే..అది అలాంటిదే అయి ఉంటుంది’ అంటూ సమాధానమిచ్చారు. చూస్తుంటే రజనీకి అప్పుడే పొలిటికల్ బుద్దలు వచ్చినట్టున్నాయి.