చంద్రబాబుతో జగపతి బాబు భేటీ.. ఏంటీ మేటరు.. !!

నటుడు జగపతి బాబు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ కావడం హాట్ టాపిక్ గా మారింది. ఈ ఉదయం అమరావతికి వచ్చిన జగపతి సీఎం చంద్రబాబుతో సమావేశమయ్యారు. ఈ నేపథ్యంలో పలు ఊహాగానాలకి తెరలేచింది. అసలే ఎన్నికల కాలం.. జగపతి ఏమైనా పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నారా.. ? వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నారా ?? అనే అనుమానాలు కలుగుతున్నాయి. హీరోగా ఎన్నో సూపర్ హిట్ సినిమాలు చేసిన జగపతి.. ఇప్పుడు విలన్ గా అంతమించి పేరు తెచ్చుకొన్నారు.

‘లెజెండ్’ సినిమాతో విలన్ గా టర్న్ తీసుకొన్న జగపతి.. తెలుగు, తమిళ్, మళయాళం సినిమాల్లో నటిస్తూ బిజీగా గడుపుతున్నారు. పర్సనల్ గానూ ఊదార స్వభావి. డబ్బుకు పెద్దగా విలువ ఇవ్వరు. ఆపదలో ఉన్నారని తెలిస్తే సాయం చేసే గుణం ఆయనది. ఇండస్ట్రీలోనూ ఆయనకు మంచి సంబంధాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో జగపతి ఎమ్మెల్యే బరిలోకి దిగితే ఇట్టే గెలిచేస్తారు. ఇప్పుడు బాబుతో జగపతి బాబు భేటీ కావడంతో ఇలాంటి ఊహాగానాలే వస్తున్నాయి.

ఐతే, ఈ భేటీ అందుకు కాదని జగపతి క్లారిటీ ఇచ్చేశారు. చంద్రబాబుతో భేటీ తర్వాత జగపతి మీడియాతో మాట్లాడారు. తమ కుటుంబం ప్రారంభించనున్న ఓ వ్యాపార సంస్థ ప్రారంభోత్సవానికి చంద్రబాబును ఆహ్వానించేందుకు తెలిపారు. ఇంతకీ జగపతి కుటుంబం ఏ వ్యాపారం చేయబోతుంది ? ఆ వ్యాపారం ఎప్పుడు ప్రారంభించబోతున్నారు అనేది తెలియాల్సి ఉంది.