‘ఉద్యమ సింహం’ కేసీఆర్ ఫస్ట్ లుక్ !

తెలుగు తెరపై బయోపిక్ ల హవా మొదలైంది. ‘మహానటి’ సావిత్రి తర్వాత మూడ్నాలుగు బయోపిక్ లు రెడీ అవుతున్నాయి. ‘ఎన్టీఆర్’ బయోపిక్, వైఎస్ఆర్ బయోపిక్ ‘యాత్ర’ ముస్తాబుతున్నాయి. ఈ రెండు కూడా ఏపీ రాజకీయాలని ప్రభావితం చేసే జీవితకథలని చెబుతున్నారు. వీటిని వచ్చే అసెంబ్లీ ఎన్నికల ప్రచార అస్త్రంగా వాడుకోబోతున్నారని చెప్పుకొంటున్నారు. అందుకు తగ్గట్టుగానే ఈ బయోపిక్ లని వచ్చే యేడాది జనవరిలో విడుదలకి ప్లాన్ చేశారు.

ఇక, తెలంగాణ రాజకీయాలని ప్రభావితం చేసేందుకు ఉద్యమ నేత, సీఎం కేసీఆర్ బయోపిక్ ‘ఉద్యమ సింహం’ రాబోతుంది. ఈ చిత్రానికి అల్లూరి కృష్ణంరాజు దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా, ఈ సినిమా ఫస్ట్ లుక్ వచ్చేసింది. కేసీఆర్ నమస్కారం చేస్తున్న పిక్ ని ఫస్ట్ లుక్ గా వదిలారు. ఇప్పుడీ లుక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ నెల 16న ఈ సినిమా పాటలని విడుదల చేయబోతున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకి ముందే సినిమా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

ఇందులో కేసీఆర్ బాల్యం నుంచి ప్రత్యేక తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర సాధన సహా పలు అంశాలను చూపించబోతున్నారు. టీవీల్లో కేసీఆర్ ప్రసంగం వస్తుందంటే మనోడు, పక్కరాష్ట్రమోడు కూడా చెవులు నిక్కబెట్టకొని చూస్తరు. ఇక కేసీఆర్ సినిమా వస్తే.. బ్లాక్ బస్టర్ హిట్టే. రికార్డులు బద్దలకావాల్సిందే అంటున్నారు కేసీఆర్ అభిమానులు, తెలంగాణ ప్రజానీకం.