ట్రెండింగ్ : 2.ఓ తర్వాత స్థానంలో టాక్సీవాలా

సూపర్ స్టార్ రజనీ కాంత్ రేంజ్ కి వెళ్లడం అంటే మాములు విషయమా.. ? ఇప్పుడు యూత్ మెగాస్టార్ విజయ్ దేవరకొండ సినిమా రజనీ సినిమా తర్వాత స్థానంలో నిలిచింది. రజనీ ‘2.ఓ’ భారీ అంచనాల మధ్య ఈ నెల 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. రూ. 500కోట్ల బడ్జెట్ తో హాలీవుడ్ రేంజ్ తో తెరకెక్కిన చిత్రమిది. ఇండియన్ సినిమా స్థాయిని పెంచే సినిమా అని టీజర్, ట్రైలర్ తో అర్థమైంది. ఇప్పుడీ సినిమా యూట్యూట్ ట్రెడింగ్ లో టాప్ స్థానంలో కొనసాగుతోంది.

ఆ తర్వాత స్థానంలో విజయ్ దేవరకొండ ‘టాక్సీవాలా’ కొనసాగుతుండటం విశేషం. ఎప్పుడో ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈ చిత్రం వాయిదా పడుతూ.. ఈ నెల 17న రిలీజ్ డేటు ఫిక్స్ చేసుకొంది. ఇలాంటి సినిమా ట్రెండింగ్ లో టాప్ -2లో నిలవడం గొప్పవిశేషం. దీనిపై విజయ్ దేవకొండ ట్విట్ చేశారు. పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి, గీతా గోవిందం బ్లాక్ బస్టర్ హిట్స్ తో క్రేజీ స్టార్ గా మారాడు విజయ్. అభిమానులు ప్రేమగా యూత్ మెగాస్టార్, తెలంగాణ పవర్ స్టార్ అని పిలుచుకొంటున్నారు.

టాక్సీవాలా ట్రెండింగ్ లో టాప్ 2 లో నిలవడంపై విజయ్ ట్విట్ చేశారు. యూట్యూబ్ ట్రెండింగ్ వీడియోల్లో తొలుత ‘2.0’ ఉంది. ఆ తరువాత టాక్సీవాల . ‘బుక్ మై షో’లో కూడా అత్యధికులు ఎదురు చూస్తున్న రెండో చిత్రం ‘టాక్సీవాలా’. మీ వెనుక నేను, నా వెనుక మీరు ఎల్లప్పుడూ ఉండి ప్రేమను పంచుతారని విజయ్ ట్వీట్ చేశాడు. విజయ్‌ ట్వీట్‌ పై కోలీవుడ్ స్టార్ సూర్య రీట్వీట్ చేశారు. ‘నీపై మా ప్రేమ ఎప్పుడూ ఉంటుంది. ఈ సినిమా మంచి విజయం సాధిస్తుంది. ‘టాక్సీవాలా’ రిలీజ్‌ కోసం ఎదురుచూస్తున్నా’ అంటూ సూర్య ట్వీట్ చేశారు. దీనిపై వెంటనే స్పందించిన విజయ్‌ ‘సూర్య సర్‌ ఐ లవ్‌ యు’ అంటూ రిప్లై చేశాడు.