చరణ్ హీరోయిన్ ఐటమ్ అయ్యింది !


ఊరమాస్ దర్శకుడు బోయపాటి దర్శకత్వంలో రామ్ చరణ్ ‘వినయ విధేయ రామ’ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. టైటిల్ మాత్రమే క్లాస్. లోపల అంతా మాస్-యాక్షన్ నే అన్న విషయం టీజర్ తో అర్థమయింది. ఈ హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ లో అదిరిపోయే ఐటమ్ సాంగ్ ఉండబోతుందనే ప్రచారం జరిగింది. చరణ్ కోసం దేవిశ్రీ ప్రసాద్ ఓ ఐటమ్ ట్యూన్ ని రెడీ చేసే పనిలో ఉన్నాడని చెప్పుకొన్నారు. ఇప్పుడని రెడీ అయ్యింది. ఐతే, అది ఓ మాస్ మసాలా సాంగ్ కోసం ఇచ్చిన ట్యూన్ అని తెలిసింది.

ఈ సాంగ్ ని చరణ్-కైరా అద్వానీలపై చిత్రీకరించనున్నారు. ఇదే ఐటమ్ సాంగ్ రేంజ్ లో ఉండబోతుందట. మరీ.. స్పెషల్ గా మరో ఐటమ్ సాంగ్ కూడా ఉంటుందా ? దాదాపు ఐటమ్ సాంగ్ రేంజ్ లో ఉండబోతున్న మాస్ మసాలా సాంగ్ తో సరిపెడతారా.. ?? అన్నది చూడాలి. ఇక, ఈ సినిమాలో సీనియర్ హీరోలు ప్రశాంత్, ఆర్యన్ రాజేష్ లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ విలన్ గా నటిస్తున్నారు. డి.వి.వి దానయ్య నిర్మాత. వచ్చే యేడాది సంక్రాంతి రేసులోకి చరణ్ సినిమా రాబోతుంది.