రజనీతో ఎంజాయ్ చేస్తున్న సిమ్రాన్ !


సీనియర్ హీరోయిన్ సిమ్రాన్ సూపర్ స్టార్ రజనీకాంత్ తో ఎంజాయ్ చేస్తూ కనిపించింది. వీరిద్దరు కలిసి నటిస్తున్న చిత్రం ‘పేటా’. కార్తిక్‌ సుబ్బరాజ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రమిది. త్రిష మరో హీరోయిన్ గా నటిస్తోంది. ఇందులో విజయ్‌సేతుపతి విలన్ గా నటిస్తున్నారు. ఇప్పటికే పేటా నుంచి రజనీ ఫస్ట్ లుక్ వచ్చేసింది. ఆయన ఇందులో మాస్ లుక్ లో కనిపిస్తున్నారు.

తాజాగా, ‘పేటా’లో సిమ్రాన్ ఫస్ట్ లుక్ వచ్చేసింది. దీన్ని సిమ్రాన్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. ఇందులో రజనీతో సిమ్రాన్ హ్యాపీ మూమెంట్ లో కనిపిస్తోంది. ‘నేను చాలా ఆనందంగా ఉన్నాను. ఇప్పటికీ నమ్మలేకపోతున్నా.. నన్ను నేను గిచ్చుకొని చూసుకున్నా’ కామెంట్ పెట్టింది సిమ్రాన్. రజనీతో సిమ్రాన్ నటిస్తున్న తొలి చిత్రమిది. ఈ సినిమా వచ్చే యేడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.