తెలంగాణ కాంగ్రెస్ ఆపద్బాంధవుడు బాలయ్య ?

తెలంగాణ కాంగ్రెస్ ఆపద్బాంధవుడు కోసం ఎదురుచూస్తోంది. అది మెగాస్టార్ చిరంజీవి అవుతాడని ఇన్నాళ్లు భావించింది. ఇప్పటికీ చిరు కాంగ్రెస్ లోనే ఉన్నారు. కాకపోతే ఉలుకు పలుకు లేకుండా ఉన్నారు. ప్రస్తుతం ఆయన సినిమాలతో బిజీగా ఉన్నారు. ఎన్నిసార్లు కాంగ్రెస్ కబరు పెట్టిన స్పందించడం లేదు. ఈ నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ ఆపద్బాంధవుడు మెగాస్టార్ అవుతాడన్న ఆశలని ఆ పార్టీ వదిలేసుకొంది. అదే సమయంలో ఆ పార్టీకి ఆపద్బాంధవుడుగా లెజెండ్ బాలకృష్ణ మారబోతున్నట్టు తెలుస్తోంది.

పారిశ్రామికవేత్త ఆనంద ప్రసాద్ కి తెలంగాణ టీడీపీ శేర్ లింగంపల్లి టికెట్ ని కేటాయించిన సంగతి తెలిసిందే. ఆనంద ప్రసాద్ బాలయ్యకి సన్నిహితుడు. అసలు ఆయనకి టికెట్ రావడం వెనక బాలయ్య ఉన్నాడని చెబుతున్నారు. అంతేకాదు.. ఆనంద ప్రసాద్ కోసం బాలయ్య ఎన్నికల ప్రచారంలోకి దిగనున్నారు. శేర్ లింగంపల్లిలో ప్రచారం చేయబోతున్నారు. ఇదే అదనుగా తీసుకొని.. శేర్ లింగంపల్లితో పాటు మరికొన్ని నియోజకవర్గాల్లో బాలయ్య చేత ప్రచారం చేయించుకోవడానికి కాంగ్రెస్ ప్లాన్ చేసింది.

అవసరమైన బాలయ్య తెలంగాణ కాంగ్రెస్ స్టార్ కాంపైనర్ గా దించడానికి చంద్రబాబు అనుపతిని తీసుకోవాలని కూడా భావిస్తున్నారట. తెలంగాణలో టీఆర్ఎస్ ని అధికారం దూరం చేయాలనే పట్టుదలతో ఉన్న చంద్రబాబు బామ్మర్థి బాలయ్యని వాడుకోవడానికి ఈజీగా ఒప్పుకొంటాడని చెప్పుకొంటున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణలో మహాకూటమి ఆపద్బాంధవుడుగా బాలయ్య మారబోతున్నట్టు పొలిటికల్ సర్కిల్స్ లో ప్రచారం జరుగుతోంది. ఇదే నిజమైతే.. ఈసారి బాలయ్య తెలంగాణలో తొడ గొట్టడం చూడబోతున్నాం. మరీ రీ సౌండ్ ఏ రేంజ్ లో ఉంటుందో చూడాలి.