కాంగ్రెస్ లో చేరబోతున్న ఇద్దరు టీఆర్ఎస్ ఎంపీలు !!


టీఆర్ఎస్ అధినేత, ఆపదర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ కు సవాల్ విసరడం అంటే రేవంత్ రెడ్డికి మహా ఇష్టం. ఆయన టీడీపీలో ఉన్న ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంటుగా వ్యవహరిస్తున్న కేసీఆర్ లక్ష్యంగా చేసుకొని విమర్శలు సంధిస్తున్నారు. తాజాగా, కేసీఆర్ కి మరో సవాల్ విసిరాడు రేవంత్. కేసీఆర్ కి దమ్ముంటే తనపై కోడంగల్ నుంచి పోటీ చేయాలని సవాల్ చేశాడు. బుధవారం రేవంత్ నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో రేవంత్ ఈసవాల్ చేశారు

అంతేకాదు.. త్వరలోనే ఇద్దరు టీఆర్ఎస్ ఎంపీలు కాంగ్రెస్ లో చేరబోతున్నారు. కేసీఆర్‌కు చేతనైతే అసెంబ్లీ ఎన్నికల లోపు ఆ ఇద్దరు ఎంపీలను ఆపాలని సవాల్ విసిరారు. ఇన్నాళ్లు రేవంత్ ఛాలెంజ్ ని కేసీఆర్ పెద్దగా పట్టించుకోలేదు. ఇప్పుడు మాత్రం పట్టించుకోక తప్పని పరిస్థితి. అసెంబ్లీ ఎన్నికల ముందే ఇద్దరు టీఆర్ ఎస్ ఎంపీలు కాంగ్రెస్ కండువా కప్పుకొంటే.. గులాభి పార్టీ పరువు పోయె పరిస్థితి. వారిని కచ్చితంగా ఆపే ప్రయత్నం చేయాలి. ఇంతకీ గోడ దూకబోతున్న ఆ ఇద్దరు ఎంపీలు ఎవరైఉంటారు.