‘అమర్ అక్భర్ ఆంటోనీ’ పబ్లిక్ టాక్
సినిమాని వినోదాత్మకంగా నడపడం శ్రీనువైట్ల ప్రత్యేకత. అదే సమయంలో క్లాస్, మాస్, ఫ్యామిలీ, యూత్ ప్రేక్షకులని ఆకట్టుకొనేలా ఆయన సినిమాలుంటాయి. పంచ్, ప్రాస డైలాగ్స్ తో దూకుడు చూపిస్తుంటాడు. ఆయన దూకుడుకి సరిగ్గా సరిపోయే హీరో మాస్ మహారాజా రవితేజ. వీరి కలయికలో వచ్చిన వెంకీ, దుబాయ్ శీను సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. ఈ నేపథ్యంలో వీరి కాంబోలో తెరకెక్కిన హ్యాట్రిక్ చిత్రం ‘అమర్ అక్భర్ ఆంటోనీ’ భారీ అంచనాల మధ్య ఈరోజు ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఇప్పటికే ఈ సినిమా ఉదయం పూట ఆట పడిపోయింది. మరీ.. పబ్లిక్ టాక్ ఏంటీ ? ఓ లుక్కేద్దాం.. పదండీ.. !
టైటిల్ లోని ముగ్గురు వ్యక్తులు కనిపిస్తున్నారు. దానికి తగ్గట్టుగానే మొదట అమర్ పాత్రని పరిచయం చేశాడు దర్శకుడు. అమర్ 14 సంవత్సరాల తర్వాత జైలు నుంచి బయటికి వస్తాడు. ఇంతకీ అమర్ ఎందుకు జైలుకి వెళ్లినట్టు ? సమాధానం కోసం ప్రేక్షకుడు ఎదురు చూస్తున్న సమయంలోనే ‘గుపెట్టా..’ సాంగ్ రిలీఫ్ ఇచ్చాడు. ఆ వెంటనే కమెడియన్స్ వెన్నల కిశోర్ , రఘు బాబు , శ్రీనివాస్ రెడ్డి లు ఎన్నారై తెలుగు అసోసియేషన్స్ ఫై కామెడీ సీన్స్ ఆకట్టుకొన్నాయి. ఇంతలో అక్భర్ పాత్ర తెరపై కి వచ్చిసేంది.
వాటా అనే ఎన్నారై అసోసియేషన్ నిర్వహిస్తున్న ఈవెంట్ అక్భర్, పూజా (ఇలియానా) పరిచయం అయ్యారు. ఇలియానా అనారోగ్య సమస్యలతో డాక్టర్ ఆంటోనీ కలుస్తోంది. ఫస్టాఫ్ లోనే మూడు (అమర్ అక్భర్ ఆంటోనీ) పాత్రలని పరిచయం చేసిన దర్శకుడు. రవితేజ, ఇలియానా కుటుంబ సభ్యులు ఎలా చనిపోయారు అనే పాయింట్ తో సినిమాపై ఆసక్తిని పెంచాడు. ఫ్లాష్ బ్యాక్, ప్రజెంట్ సన్నివేశాలతో సినిమా గ్రిప్పింగ్ గా సాగింది. మధ్య మధ్యలో ఫైట్, సాంగ్, కామెడీ సన్నివేశాలతో పక్కా కమర్షియల్ ఫార్మెట్’లో సినిమా సాగింది. క్లైమాక్స్ లో హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ తో విలన్ అంతం. కథ సుఖాంతంగా ముగించేశాడు.