ఆసీస్ క్రికెటర్లకి కోహ్లీ హెచ్చరిక

రెండు నెలల సుదీర్ఘ పర్యటన కోసమని టీమిండియా శుక్రవారం ఆస్ట్రేలియాకు చేరుకుంది. ఈ నేపథ్యంలో కోహ్లీ దక్షిణాఫ్రికా సారథి డూప్లెసిస్‌ ఆసీస్‌ క్రికెటర్లకు సూచించాడు. ఈ ఏడాది ఆరంభంలో దక్షిణాఫ్రికా, భారత్‌ సిరీస్‌లో మూడు టెస్టుల్లో కోహ్లీ 286పరుగులు సాధించాడు. మొదటి నుంచి అతని విషయంలో మా క్రికెటర్లు జాగ్రత్తగా ఉండటం వల్లే కోహ్లీని ఆ మాత్రమైనా కట్టడి చేయగలిగే అవకాశం దొరికిందని తెలిపాడు. డూప్లెసిస్‌ చెప్పింది నిజమే. కోహ్లీ ఒక్కసారి మైదానంలోకి దిగాడంటే దూకుడుగా ఆడుతూ.. ప్రత్యర్థిపై ఆధిపత్యం ప్రదర్శించడానికే ప్రాధానితనిస్తాడు. అందుకే నోటి దురుసు ఎక్కువగా ప్రదర్శించే ఆసీస్ ఆటగాళ్లు ఇంకా నోళ్లు తెరవలేదని తెలుస్తోంది.