నాని బ్యాటింగ్ బాగుందట !

నాచురల్ స్టార్ నాని బ్యాటింగ్ లో ఇరగదీస్తున్నాడు. ఆయన నటిస్తున్న తాజా చిత్రం ‘జెర్సీ’. శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్. క్రికెట్ నేపథ్యంలో తెరకెక్కుతోన్న చిత్రమిది. ఈ చిత్రానికి గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్నారు. అనిరుధ్ సంగీతం. సితార ఎంటర్‌టైన్మెంట్స్ నిర్మిస్తోంది. జెడ్ స్వీడుతో షూటింగ్ జరుపుకొంటున్న ఈ సినిమా అవుట్ పుట్ పై నాని సంతృప్తిని వ్యక్తం చేశాడు.

ఇందులో నాని మూడు ఢిఫరెంట్ గెటప్స్ లో కనిపిస్తాడట. యువకుడిగా, మధ్య వయస్కుడిగా, వృద్ధుడిగా కనిపించనున్నాడు. విజువల్ ఎఫెక్ట్స్ అద్భుతంగా ఉండబోతున్నాయని చెబుతున్నారు. తన కెరియర్లో ఇది ఒక డిఫరెంట్ మూవీ అవుతుందని నాని భావిస్తున్నాడు. ఇప్పటి వరకు పూర్తయిన సినిమాని చూసి ఆనందం వ్యక్తం చేశాడు. దీంతో నాని బ్యాటింగ్ బాగుందట అని చెప్పుకొంటున్నారు.

నాన్ స్టాప్ హిట్స్ దూసుకెళ్తున్న నానికి ‘కృష్ణార్జునయుద్ధం’ బ్రేక్ వేసింది. ఆ తర్వాత నాని చేసిన ‘దేవదాస్’ హిట్ టాక్ సొంతం చేసుకొన్న కలెక్షన్స్ పెద్దగా రాలేదు. ఈ సినిమా క్రెడెట్ ఎక్కువ శాతం నాగ్ ఖాతాలోకే వెళ్లింది. ఈ నేపథ్యంలో జెర్సీతో మళ్లీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలనే కసితో నాని ఉన్నాడు. మరీ.. నాని మైదానంలో ఏ రేంజ్ లో రెచ్చిపోతాడన్నది చూడాలి.