ఇంటిపేరు మార్చుకున్న పవన్ కళ్యాణ్ !

జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన ఇంటిపేరు మార్చుకున్నారు. ఇకపై తన ఇంటిపేరు ‘కొణిదెల’ కాదు. ‘తెలుగు’ అని
తెలిపారు పవన్. ప్రస్తుతం పవన్ తూర్పుగోదావరి జిల్లాలో ‘ప్రజా పోరాట యాత్ర’లో ఉన్నారు. అక్కడ బహిరంగసభలో ప్రజలని ఉద్దేశించి మాట్లాడుతూ.. తన ఇంటి పేరు ‘తెలుగు’గా మార్చుకొంటున్న తెలిపారు. దీంతో ఇకపై పవన్ ని ‘తెలుగు పవన్ కళ్యాణ్’ అని పిలవాల్సి ఉంటుంది. దీనిపై ఆయన ఫ్యాన్స్ రియాక్షన్ ఎలా ఉండబోతుందన్నది ఆసక్తిగా మారింది.

తెలుగోడి ఆత్మగౌరవం కోసం ఎన్టీఆర్ ‘తెలుగుదేశం పార్టీ’ని స్థాపించారు. అతి తక్కువ కాలంలోనే ఆ పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో విజయవంతం అయ్యాడు. తెలుగు ప్రజల గుండెల్లో చెదరని ముద్ర వేశాడు. తెలుగు ప్రజల అన్నగా మారాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా ఎన్టీఆర్ దారిలోనే పయనిస్తున్నట్టు కనబడుతోంది. తనని తాను ‘తెలుగు’ ప్రజల బ్రాండ్ అంబాసిడర్ గా చూపించేందుకు ప్రయత్నిస్తున్నట్టు కనబడుతోంది. మరీ.. ఇందులో ఏ మేరకు విజయవంతం అవుతాడు. ‘జనసేన’ని అధికారంలోకి తీసుకురాగలుగుతాడా ?? అన్నది వేచి చూడాలి.

తూర్పుగోదావరి జిల్లాలో పవన్ ఇంటిపేరు ‘తెలుగు’గా మార్చుకోవడంతో పాటు ప్రజలకి కొన్నిహామీలు కూడా ఇచ్చారు. జనసేన అధికారంలోకి వస్తే ఉచితంగా వంట గ్యాస్ ను సరఫరా చేస్తామని హామీ ఇచ్చారు. దివ్యాంగులు పింఛన్ ని అధికారులు ఇంటికెళ్లి ఇచ్చేవిధంగా ఏర్పాట్లు చేస్తామని మరో హామీ ఇచ్చారు. అడ్డదారిలో సీఎం అయిన చంద్రబాబులా తాను మాటలు మార్చబోనని
తనదైన శైలిలో విమర్శలు చేశారు పవన్.