‘టాక్సీవాలా’ టాక్ అదిరింది !

హీరో విజయ్ దేవరకొండ మరోసారి తన నటనతో షాక్ ఇచ్చాడు. ‘అర్జున్ రెడ్డి’ సినిమాలో విజయ్ నటన చూసి ప్రేక్షకుల మతిపోయింది. ఏం చేసాడ్రా బాబూ.. అనుకొన్నారు. అర్జున్ రెడ్డి పాత్రలో పులిలా గాండ్రించాడు. ఆ అరెపులు, ఆ నటన ట్రెండ్ సెట్ చేశాయి. ఆ తర్వాత ‘గీత గోవిందం’ సినిమాలో పిల్లిలా మారిపోయాడు. గోవిందుడి పాత్రలో మేడమ్ మేడమ్ అంటూ గీత చూటూ తిరిగి ప్రేక్షకులని కడుపుబ్బ నవ్వించేశాడు. అర్జున్ రెడ్డి పాత్ర చేసింది ఈ గోవిందుడేనా ? అనే డౌటు కలిగింది.

ఇప్పుడు టాక్సీవాలాతో మరోసారి ప్రేక్షకులకి షాక్ ఇచ్చాడు విజయ్. రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ – ప్రియాంక జవాల్కర్ జంటగా నటించిన చిత్రమిది. గీతా ఆర్ట్స్ 2, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మించాయి. రిలీజ్ కి ముందే లీకైనా ‘టాక్సీవాలా’ హిట్ టాక్ తో ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. సినిమా ఫస్టాఫ్ ని సరదా సరదాగా నడిపిన దర్శకుడు.. క్రమంగా హారర్ టచ్ ఇస్తూ వెళ్లాడు. ఉత్కంఠకు గురి చేస్తూ ట్విస్టులు రిలీవ్ చేస్తూ వెళ్లాడు. సినిమా అదిరిపోయింది. విజయ్ ఖాతాలో మరో హిట్ పడినట్టేనని పబ్లిక్ టాక్.

ఇందులో శివ (విజయ్) ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న కుర్రాడిగా కనిపించాడు. యేడాది పాటు తిరిగిన ఏ జాబ్ దొరక్కపోవడంతో.. చివరికి క్యాబ్ డ్రైవర్ మారతాడు. ఆ కారులో దెయ్యం ఉండటం.. దాని కారణం క్యాబ్ ఎక్కిన ఫకీర్, కస్టర్స్ ఎదుర్కొన్నే సన్నివేశాలని వినోదాత్కంగా చూపించారు. ఇంటర్వెల్ తర్వాత సినిమాని రివెంజ్ డ్రామాగా సాగింది. ఫస్టాఫ్ చాలా బాగుంది. సెకాంఢాఫ్ లో కాస్త పట్టుసడలినట్టు అనిపించినా.. విజయ్ నటనతో సినిమాని నిలబెట్టే ప్రయత్నం చేశాడు. ఫైనల్ గా టాక్సీవాలా పై హిట్ టాక్ వచ్చేసింది.