రివ్యూ : టాక్సీవాలా – టెన్ థౌజెండ్ వాలాలా పేలింది
చిత్రం : టాక్సీవాలా
నటీనటులు : విజయ్ దేవరకొండ, ప్రియాంక జవాల్కర్, మాళవికా నాయర్.. తదితరు
సంగీతం : జాక్స్ బెజోయ్
దర్శకత్వం : రాహుల్ సంక్రిత్యాన్
నిర్మాత : జిఏ2 పిక్చర్స్ మరియు యు.వి. క్రియేషన్స్
రిలీజ్ డేటు : 17 నవంబర్, 2017
రేటింగ్ : 3.25/5
‘అర్జున్ రెడ్డి’ సినిమాలో విజయ్ దేవరకొండ నటన చూసి ప్రేక్షకుల మతిపోయింది. ఏం చేసాడ్రా బాబూ.. అనుకొన్నారు. అర్జున్ రెడ్డి పాత్రలో పులిలా గాండ్రించాడు. ఆ అరెపులు, ఆ నటన ట్రెండ్ సెట్ చేశాయి. ఆ తర్వాత ‘గీత గోవిందం’ సినిమాలో పిల్లిలా మారిపోయాడు. గోవిందుడి పాత్రలో మేడమ్ మేడమ్ అంటూ గీత చూటూ తిరిగి ప్రేక్షకులని కడుపుబ్బ నవ్వించేశాడు. అర్జున్ రెడ్డి పాత్ర చేసింది ఈ గోవిందుడేనా ? అనే డౌటు కలిగింది. ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చిన విజయ్ ‘నోటా’ కాస్త నిరాశ పరిచింది.
అయినా విజయ్ తాజా చిత్రం ‘టాక్సీవాలా’పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ – ప్రియాంక జవాల్కర్ జంటగా నటించిన చిత్రమిది. గీతా ఆర్ట్స్ 2, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మించాయి. రిలీజ్ కి ముందే లీకైనా ‘టాక్సీవాలా’ టాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్ స్టార్స్ సపోర్టుగా నిలిచారు. టాక్సీవాలని థియేటర్స్ లో చూడండి.. పైరసీని అరికట్టండని పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చిన ‘టాక్సీవాలా’ ఎలా ఉన్నాడు తెలుసుకొనేందుకు రివ్యూలోకి వెళదాం పదండీ.. !
కథ :
శివ (విజయ్ దేవరకొండ) బిలో యావరేజ్ స్టూడెంట్. ఆయనకి డిగ్రీ పూర్తి చేయడానికే ఐదేళ్లు పట్టింది. హైదరాబాద్ వెళ్లి సేహితుడు (మధు నందన్) దగ్గర ఉంటూ ఉద్యోగం కోసం ప్రయత్నాలు మొదలెడతాడు. ఒకట్రెండు ట్రై చేసిన వర్కవుట్ కావు. దీంతో వదిన బంగారం అమ్మి ఇచ్చిన డబ్బుతో ఓ కారుకొని క్యాబ్ డ్రైవర్ గా మారతాడు. టాక్సీ తొలి రైడ్‌లోనే అను అమ్మాయితో ప్రేమలో పడతాడు. అంతా హ్యాపీ అనుకొంటున్న సమయంలో టాక్సీలో దెయ్యం ఉందని తెలుస్తుంది.
కారులో ప్రయాణించిన ఓ డాక్టర్ ను ఆ కారు అతి దారుణంగా చంపేస్తోంది. అసలు డాక్టర్ ని కారు ఎందుకు చంపింది ? కారు రెవెంజ్ వెనక ఉన్న సస్పెన్స్ ఏంటీ ?? శివతో శివకు ఆ కార్ కు ఎందుకు అంత అటాచ్ మెంట్ పెరుగుతుంది ? ఫైనల్ గా ఆ కారు ఎవరి పై రివేంజ్ తీసుకోవాలనుకుంటుంది ? అనేది సూపర్ నేచురల్ థ్రిల్లర్ గా సాగిన మిగితా కథ.
ప్లస్ పాయింట్స్ :
* విజయ్ నటన
* కామెడీ
* సినిమాటోగ్రఫీ
* ఎమోషనల్ సీన్స్
మైనస్ పాయింట్స్ :
* విజువల్ ఎఫెక్ట్స్
* సెకండ్ హాఫ్‌లో కొన్ని సీన్స్
ఎలా ఉందంటే ?
సూపర్ నేచురల్ థ్రిల్లర్ కాన్సెప్ట్’తో తెరకెక్కిన చిత్రమిది. ఫస్ట్ హాఫ్ అంతా సరదా సరదాగా సాగిపోయింది. హీరో, ఫ్రెండ్స్ మధ్య వచ్చే సన్నివేశాలు నవ్విస్తాయి. క్యాబ్ ఎక్కిన ఫకీర్, కస్టమర్స్ ఎదుర్కొన్నే సన్నివేశాలని వినోదాత్మకంగా ఉంటాయి. సెకాంఢాఫ్ లో సినిమా కాస్త పడినట్టు కనబడినా.. మార్చురీ సీన్, కైమాక్స్ లో ఎమోషనల్ సీన్స్ సినిమాని నిలబెట్టాయి. సినిమాలో కామెడీ హైలైట్ గా నిలిచింది. ఫస్టాప్ అదిరిపోయింది. సెకాంఢాఫ్ ఫర్వాలేదు. కామెడీ, హార్రర్, ఎమోషనల్స్ సీన్స్ గ్రిప్పింగ్ గా డీల్ చేశారు.
ఎవరెలా చేశారంటే ?
విజయ్ దేవరకొండ నటనతో షాకులిస్తుంటాడు. రౌడీ గా, లవర్ గా మెప్పించిన విజయ్.. ఈసారి భయపడటం కూడా బాగా చూపించాడు. ఎమోషనల్ సన్నివేశాలో ఆయన నటన అద్భుతం. మొత్తంగా విజయ్ ఆల్ రౌండర్ అనిపించుకొంటున్నాడు. హీరోయిన్ ప్రియాంక పాత్రకి పెద్దగా ప్రాధాన్యం లేదు. ఐతే, గ్లామర్ తో ఆకట్టుకొంది. మరో హీరోయిన్ మాళవిక నాయర్ కి ప్రాధాన్యం ఉన్న పాత్ర దక్కింది. అందులో ఆమె మెప్పించింది. హీరో ఫ్రెండ్‌గా నటించిన మధుసూదన్ మంచి కామెడీ టైమింగ్‌తో నవ్వించాడు. ఇతర పాత్రల్లో శిజు, కళ్యాణీ, యమున, రవివర్మ, రవిప్రకాష్, ఉత్తేజ్‌లు తదితరులు తమ తమ పరిధి మేరకు నటించారు.
సాంకేతికంగా :
జేక్స్ బిజాయ్ అందించిన పాటల్లో ‘మాట వినదు.. ‘ బాగుంది. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. విజువల్ ఎఫెక్ట్స్ ఆకట్టుకొనేలా లేవు. సుజిత్ సారంగ్ సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ ఓకే. గీతాఆర్ట్స్, యూవీ క్రియేషన్స్ నిర్మాణ విలువలు బాగున్నాయి.
చివరగా : టాక్సీవాలా రిలీజ్ కి ముందే లీకైంది. అసలు అందులో మేటరుయే లేదు. అందుకే సినిమాని పలుమార్లు వాయిదా వేస్తూ వచ్చారనే ప్రచారం జరిగింది. ఇవన్నీ పుకార్లు మాత్రమే. ‘టాక్సీవాలా’ బాగుంది. విజయ్ నటన అదిరిపోయింది. థియేటర్స్ లో చూసి ఎంజాయ్ చేయాల్సిన సినిమా. పైరసీ చూస్తే ప్రేక్షకుడే నష్టపోయినట్టు. ఎందుకంటే.. టాక్సీవాలా – టెన్ థౌజెండ్ వాలాలా పేలింది. ఆ సౌండ్ థియేటర్స్ లో వింటే చాలా బాగుంది.
బాటమ్ లైన్ : టాక్సీవాలా – టెన్ థౌజెండ్ వాలాలా పేలింది
రేటింగ్ : 3.25/5