జగన్’తో పవన్ భేటీపై బొత్స స్పందన
రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శతృవులు ఉండరు. దీనికి ఉదాహరణగా తాజా తెలుగు రాష్ట్రాల రాజకీయాలని చెప్పుకోవచ్చు. చిరకాల ప్రత్యర్థి అయిన కాంగ్రెస్ తో టీడీపీ కలిసిపోలేదా ! గత ఎన్నికల్లో వైఎస్ జగన్ కి ముఖ్యమంత్రి పదవి దక్కపోవడమే లక్ష్యంగా పని చేసిన జనసేన అధినేత.. ఇప్పుడా పార్టీ దగ్గరవ్వడం లేదా. ఈ నేపథ్యంలోనే ఇటీవల విశాఖలో జగన్ తో పవన్ భేటీ అయ్యారనే ప్రచారం జరుగుతోంది. విశాఖకు చెందిన వట్టి రవి ఇంట్లో ఈ భేటీ జరిగిందని సమాచారమ్.
ఇటీవల పవన్ కళ్యాణ్ సీక్రెట్ మీటింగ్స్ ని కండెక్ట్ చేస్తున్నారు. ఆయన హైదరాబాద్ లో కాపునేతలతో రహస్య సమావేశం నిర్వహించడం. పార్టీ కోసం ఫండ్స్ ని వసూలు చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని మహాన్యూస్ సీఈవో మూర్తి స్టీరింగ్ ఆపరేషన్ ద్వారా బయటపెట్టడం జరిగింది. తదనంతరం చోటు చేసుకొన్నపరిణామాలతో మూర్తి మహాన్యూస్ కి రాజీనామా చేసి బయటికి రావాల్సి వచ్చింది. ఈ విషయం పక్కన పెడితే.. అసలు జగన్ -పవన్ భేటీ నిజంగానే జరిగిందా.. ?
దీనిపై తాజాగా, వైసీపీ కీలక నేత బొత్స సత్యనారాయణ స్పందించారు. జగన్‌ను పవన్ కలిశారంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదని కొట్టిపారేశారు. అంతేకాదు.. వచ్చే ఎన్నికల్లో తాము ఏ పార్టీతో పొత్తు లేకుండానే బరిలో దిగుతామని స్పష్టం చేశారు. సీబీఐ, ఈడీలను రాష్ట్రంలోకి రాకుండా అడ్డుకోవటం వెనుక సీఎం చంద్రబాబు స్వార్థం దాగి ఉందని ఆరోపించారు బొత్స. బొత్స ఎంత చెప్పిన జగన్-పవన్ భేటీపై ప్రజల్లో ఇంకా అనుమానాలున్నాయి. మరీ.. అవెప్పుడు క్లియర్ అవుతాయో చూడాలి.