#RRR షూటింగ్ మొదలు.. ఆల్ ది బెస్ట్ తారక్, చరణ్ !


దర్శకధీరుడు రాజమౌళి పని మొదలెట్టాడు. ఆయన దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఎన్టీఆర్, రామ్ చరణ్ ల మల్టీస్టారర్ #RRR (వర్కింగ్ టైటిల్) రెగ్యూలర్ షూటింగ్ ఇవాళ మొదలైంది. తొలిరోజు షూటింగ్ లో పాల్గొనబోతున్న చరణ్ కి ఆయన సతీమణి ఉపాసన ‘ఆల్ ది బెస్ట్’ చెబుతూ ట్విట్ చేసింది. చరణ్ తో తారక్ కూడా తొలిరోజే నుంచే షూటింగ్ లో పాల్గొనబోతున్నారు. వీరిద్దరు కలిసి తొలి పదిరోజులు షూటింగ్ లో పాల్గొనేలా రాజమౌళి ప్లాన్ చేశాడని తెలిసింది.

ఈ సినిమా కోసం రామ రావణ రాజ్యం, తారక్ రామ్ టైటిల్స్ ప్రచారంలో ఉన్నాయి. ఇందులో తారక్, చరణ్ పాత్రలు చెరి సమానంగా ఉండేలా రాజమౌళి ప్లాన్ చేశారట. తారక్ విలన్ గా పాత్రలో కనిపించబోతున్నాడనే ప్రచారం కూడా జరుగుతోంది. హీరోయిన్స్ గా కైరా అద్వానీ, కీర్తి సురేష్ లని తీసుకొన్నట్టు తెలుస్తోంది. బాహుబలి మాదిరిగా ఈ చిత్రం కోసం హాలీవుడ్, బాలీవుడ్ టెక్నిషన్స్ పనిచేయబోతున్నారు. బాహుబలి రేంజ్ లో తెలుగు, తమిళ్, హిందీ బాషల్లో విడుదల చేయబోతున్నారు.