బన్నీ మళ్లీ పార్టీ ఇచ్చాడు !

స్టయిలీష్ స్టార్ అల్లు అర్జున్ కి ఓ మంచి అలవాటు ఉంది. కంటెంట్‌ ఉన్న సినిమాలను తనవంతుగా పోత్సాహిస్తుంటారు. అంతేకాదు.. ఆ సినిమాలు హిట్టైతే చిత్రబృందాన్ని ప్రత్యేకంగా ఆహ్వానించి పార్టీ కూడా ఇస్తుంటాడు. గతంలో పెళ్లిచూపులు, మహానటి, గీత గోవిందం సినిమాలు ఘన విజయం సాధించినప్పుడు బన్నీ పార్టీ ఏర్పాటు చేశారు. ఇప్పుడు ‘టాక్సీవాలా’ కోసం బన్నీ పార్టీ ఇచ్చారు. దానికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

‘గీత గోవిందం’ తర్వాత విజయ్‌ దేవరకొండ నుంచి వచ్చిన చిత్రం ‘టాక్సీవాలా’. ఈ చిత్రానికి రాహుల్‌ దర్శకత్వం వహించారు. ప్రియాంక జవాల్కర్‌, మాళవికా నాయర్‌ హీరోయిన్స్. విడుదలకి ముందే లీకైన ఈ సినిమా కోసం ఇండస్ట్రీ మొత్తం మద్దతుగా నిలిచింది. శనివారం ప్రేక్షకుల ముందుకొచ్చిన టాక్సీవాలా హిట్ టాక్ ని సొంతం చేసుకొంది. ఇండస్ట్రీకి నైతిక బలానిచ్చింది. ఈ నేపథ్యంలో బన్నీ చిత్రబృందాన్ని ప్రత్యేకంగా ఆహ్వానించి పార్టీ ఇచ్చారు.

ఇక, ‘నా పేరు సూర్య’ తర్వాత బన్నీ మరో సినిమా మొదలెట్టలేదు. విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో అనుకొన్న సినిమా దాదాపు క్యాన్సిల్ అయ్యిందని సమాచారమ్. ఈ నేపథ్యంలో బన్నీ తన తదుపరి సినిమాని త్రివిక్రమ్ దర్శకత్వంలో చేసేందుకు రెడీ అవుతున్నారు. డిసెంబర్ లో ఈ సినిమా ప్రారంభం కానుంది. ఇది ఓ బాలీవుడ్ సినిమా రిమేక్ అన్న ప్రచారం కూడా జరుగుతోంది. త్వరలోనే ఈ సినిమా పూర్తి వివరాలు తెలియనున్నాయి.