కేసీఆర్’కు పవన్ పెద్ద సాయం !


కేసీఆర్ పనితనం అంటే పవన్ కళ్యాణ్’కు మాహా ఇష్టం. ఆ ఇష్టాన్ని పలుమార్లు బాహాటంగానే చూపించారు. కేసీఆర్ ని కలిసి రైతుల కోసం చేస్తున్న కృషిని అభినందించారు. పవన్ ఫస్ట్ టైం పొలిటికల్ యాత్ర ప్రారంభించినప్పుడు కూడా కేసీఆర్ ని కలిసి సలహాలు, సూచనలు తీసుకొన్నారని టాక్. ఐతే, ఇప్పుడు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పవన్ కేసీఆర్ కి పెద్ద సాయమే చేశారు. ఈ సారి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకి జనసేన దూరంగా ఉంటుందని ప్రకటించారు పవన్.

ఈ నిర్ణయంపై వివరణ కూడా ఇచ్చారు పవన్. తెలంగాణ ముందస్తు ఎన్నికలు జరగడం వల్ల పూర్తిస్థాయిలో సన్నద్ధం కాలేకపోయాం. ఐతే, లోక్‌సభ ఎన్నికల్లో మాత్రం తెలంగాణలోని అన్ని స్థానాలకి పోటీ చేస్తాం. ఇందుకు సన్నద్ధం అవుతున్నామని తెలిపారు. మరోవైపు, వైసీపీ కూడా తెలంగాణా అసెంబ్లీ ఎన్నికలకి దూరంగా ఉండాలని నిర్ణయించుకొంది. ఈ రెండు పార్టీలు కేసీఆర్ కి సాయం చేసినట్టేనని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. వీరి పోటీలో దిగితే ఓటు బ్యాంకు చీలిపోయేది.

అది తెరాసకి కూడా నష్టం కలిగించేదని చెబుతున్నారు. అసలు జనసేన, వైసీపీ తెలంగాణలో పోటీకి దిగడం వెనక వేరే కారణాలున్నాయనే ప్రచారం కూడా ఉంది. కేసీఆర్, జగన్, పవన్ లు భాజాపా మద్దతుదారులు. వచ్చే లోక్ సభ ఎన్నికల్లోనూ వీరు కేంద్రంలో బీజేపీని సపోర్టు చేయబోతున్నారు. ఇందులో భాగంగా జరిగిన ముందస్తు ఒప్పందంలో భాగంగానే పవన్, జగన్ లు కేసీఆర్ కి మద్దతుగా నిలుస్తారని రాజకీయ వర్గాల సమాచారమ్.