‘2.O’ని అంతకుమించేలా ‘RRR’ !


దర్శకధీరుడు రాజమౌళి మల్టీస్టారర్ #ఆర్ఆర్ఆర్ మొదలైపోయింది. ‘బాహుబలి’ తర్వాత రాజమౌళి చేస్తున్న చిత్రం కావడం ‘ఆర్ఆర్ఆర్’పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. అందుకు తగ్గట్టుగా ‘ఆర్ఆర్ఆర్’ని భారీ బడ్జెట్ తో హై టెక్నాలజీతో తీసుకొచ్చే ప్రయత్నంలో ఉన్నాడు జక్కన్న. ఇప్పటివరకు ఇండియాలో అత్యంత హై టెక్నాలజీతో రూపొందిన సినిమాగా ‘2.ఓ’ నవంబర్ 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఐతే, ‘2.ఓ’ అంతకుమించేలా రాజమౌళి మల్టీస్టారర్ ఉండబోతున్నట్టు సమాచారమ్.

శంకర్ ‘2.0’ కోసం 3డి టెక్నీలజీతో పాటు 4డి సౌండ్ వాడారు. ‘ఆర్ఆర్ఆర్’ 4జీ టెక్నాలజీ, 4డి సౌండ్ వాడబోతున్నారు..అంతేకాదు రాజమౌళి డిజైన్ చేసిన యాక్షన్ సీన్స్ ఊహించని రేంజ్ లో ఉండబోతున్నాయట. వాటిని ఏకంగా 120 కెమెరాలతో చిత్రీకరించబోతున్నారు. దీంతో సినిమా చూస్తున్న ప్రేక్షకులకు సరికొత్త అనుభూతి కలుగుతుందట. అత్యంత హై టెక్నాలజీతో రూపొందిన ఇండియన్ సినిమాగా రాజమౌళి నిలవనుంది. సినిమా క్వాలిటీయే కాదు బిజినెస్ విషయంలో జక్కన్న సూపర్ ప్లాన్ వేశాడట.

దాదాపు రూ. 300కోట్ల భారీ బడ్జెట్ తో ‘ఆర్ఆర్ఆర్’ని ప్లాన్ చేశాడట. దీనికి రెట్టింపు ప్రీ-రిలీజ్ బిజినెస్ రూ.600కోట్లు వచ్చేలా ముందస్తు ప్లాన్ చేశాడట. ఒక్క థియేట్రికల్ రైట్స్ రూపంలోనే రూ. 400కోట్లు తీసుకొచ్చేలా చేసినట్టు తెలిసింది. ఈ మల్టీస్టారర్ ని ‘బాహుబలి’ రేంజ్ లో తెలుగు, తమిళ్, హిందీ బాషల్లో విడుదల చేయబోతున్నారు. ఐతే, ఈసారి బాలీవుడ్ మార్కెట్ పై ఎక్కువ ఫోకస్ చేయబోతున్నాడట. ఇందులో భాగంగానే బాలీవుడ్ నటుడు అజయ్ దేవగణ్ ని తీసుకొంటున్నట్టు తెలుస్తోంది. శాటిలైట్స్, డిజిటిల్ రైట్స్ రూపంలో మరో రూ. 200కోట్ల ప్రీ-రిలీజ్ బిజినెస్ రాబట్టేలా ప్లాన్ చేశారట.

ఇక, సినిమాలో తారక్, చరణ్ లు అన్నదమ్ములుగా కనిపించబోతున్నారు. ఇది 1920కాలం నాటి కథ. ఈ సినిమా కోసం తారక్ రామ్, రామ రావణ రాజ్యం అనే టైటిల్స్ ప్రచారంలో ఉన్నాయి. ఇక, హీరోయిన్స్ గా రష్మిక మందన, కీర్తి సురేష్, రకుల్ ప్రీత్ సింగ్ పేర్లు వినబడుతున్నాయి. యంగ్ రైబల్ స్టార్ ప్రభాస్ ఇందులో గెస్ట్ రోల్ లో మెరెసే అవకాశాలు ఉన్నట్టు చెప్పుకొంటున్నారు. మొత్తానికి.. ఆర్ఆర్ఆర్ కోసం రాజమౌళి బోలేడు సస్పెన్స్ ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. వాటిని ఎప్పుడు రిలీవ్ చేస్తాడో చూడాలి.