దర్శకుడికి సారీ చెప్పిన బన్నీ !
టాలీవుడ్ యువ దర్శకుడుకి స్టయిలీష్ స్టార్ అల్లు అర్జున్ సారీ చెప్పడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఇంతకీ ఆ యువ దర్శకుడు ఎవరు ? బన్నీ ఎందుకు సారీ చెప్పాల్సి వచ్చింది ?? అంటే.. కంటెంట్ ఉన్న సినిమాలని సపోర్టు చేస్తుంటాడు బన్నీ. ఇందులో భాగంగానే విజయ్ దేవరకొండ నటించిన రెండు వరుస సినిమాలు గీత గోవిందం, టాక్సీవాలా సినిమాలని బన్నీ ప్రమోట్ చేశాడు. ఈ రెండు సినిమాల ప్రీ-రిలీజ్ వేడుకలకి బన్నీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ రెండూ సూపర్ హిట్ అవ్వడం విశేషం.
ఈ సినిమాలు హిట్ టాక్ తెచ్చుకొన్నాక చిత్రబృందాన్ని ప్రత్యేక ఆహ్వానించి పార్టీ కూడా ఇచ్చాడు. ఇటీవల టాక్సీవాలా చిత్రబృందానికి బీ – డబ్స్ లో పార్టీ ఇచ్చారు బన్నీ. ఈ సందర్భంగా దర్శకుడు రాహుల్ ని పక్కకి తీసుకెళ్లి సారీ చెప్పాడట. ఎందుకు సర్ ‘సారీ’ అని అడిగితే.. టాక్సీవాలా ప్రీ-రిలీజ్ వేడుకలో మీ గురించి మాట్లాడటం మరిచిపోయాను. ‘నేను కొత్త, నా వర్క్ ను మీరు చూడలేదు సర్ అని రాహుల్ చెప్పినా.. డైరెక్టర్ అనేది గౌరవప్రదమైన పొజీషన్. అలాంటి మీ గురించి స్టేజ్ పై మాట్లాడటం మరిచిపోయాను. సారీ అని చెప్పాడట. బన్నీ అలా మాట్లాడటం ఆయన గొప్పతనం అన్నారు రాహుల్.
నా పేరు సూర్య తర్వాత బన్నీ మరో సినిమాని మొదలెట్టలేదు. త్రివిక్రమ్ దర్శకత్వంలో బన్నీ తదుపరి సినిమా తెరకెక్కనుంది. డిసెంబర్ లోనే ఈ సినిమా మొదలుకానుంది. ఇక, బన్నీ ముద్దుల తనయ అర్హ రెండో పుట్టినరోజు సెలబ్రేషన్స్ లో గోవాలా జరిగాయి. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ మధ్య బన్నీని సినిమాలో కాకుండా… బయటే ఎక్కువగా చూస్తున్నాం. ఆయన్ని తెరపై చూడ్డానికి ఇంకెన్ని రోజులు వెయిట్ చేయాలో.. మరీ.. !