వైరల్ : కేటీఆర్ ముందు మల్లారెడ్డి చిందులు

మల్కాజిగిరి ఎంపీ మల్లారెడ్డి మరోసారి తన చేతలతో ఆకట్టుకొన్నారు. ఆయన వివాదాల జోలికి వెళ్లరు. కానీ, తన చేతలు, చేష్టలతో హెడ్ లైన్స్ లోకి ఎక్కుతుంటారు. గతంలో కాలేజీ విద్యార్థులని ఉద్దేశించి ఆయన చేసిన ప్రసంగాలు, పలు కార్యక్రమాల్లో ఆయన వేసి స్టెప్పులు వైరల్ గా మారాయి. ఇటీవల కార్యకర్తలు మల్లారెడ్డి పాలాభిషేకం చేసిన వీడియో ఒకరి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ సారి మల్లారెడ్డి మంత్రి కేటీఆర్ ముందే చిందేయడం హైలైట్ గా నిలిచింది.

మల్కాజిగిరి ఎంపీగా కొనసాగుతున్న మల్లారెడ్డి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మేడ్చల్ స్థానం నుంచి టీఆర్ ఎస్ అభ్యర్థిగా నిలబడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా ధూలపల్లిలోని మల్లారెడ్డి కాలేజ్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి కేటీఆర్‌, నగర మేయర్‌ బొంతు రామ్మోహన్‌లు పాల్గొన్నారు. కేటీఆర్‌ వేదికపైకి చేరుకున్నఅనంతరం ఆనందంతో అక్కడున్నవారికి అభివాదం చేసిన మల్లారెడ్డి చిన్నగా గంతులేశారు.

మల్లారెడ్డి గత్తులేయడం చూసి.. కేటీఆర్ నవ్వుని ఆపులేకపోయారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక, మేడ్చల్ లో కాంగ్రెస్ అభ్యర్థిగా కెల్ ఎల్ ఆర్ పోటీలో ఉన్నారు. మల్లారెడ్డి-కె ఎల్ ఆర్ మధ్యే ప్రధాన పోటీ ఉండనుందని చెబుతున్నారు. ఐతే, టీఆర్ ఎస్ రెబల్ అభ్యర్థిగా నక్కా ప్రభాకర్ గౌడ్ బరిలోకి దిగడం గులాభి పార్టీని కలవరపెడుతోంది. మరీ.. మల్లారెడ్డి ఈ సారి ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీకి వెళతారేమో చూడాలి.