పార్టీలో నివేదా డ్యాన్స్.. వైరల్ !

యంగ్ హీరోయిన్ నివేదా థామస్ సినిమాలు తగ్గించేసి చదువుపై ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలోనే జెంటిల్ మెన్, నిన్నుకోరి, జై లవ కుశ సినిమాల తర్వాత మరో సినిమాని ఒప్పుకోలేదు. ఇప్పుడు చదువు పూర్తికావడంతో మళ్లీ సినిమాలతో బిజీ అయ్యేందుకు ప్లాన్ చేసుకొంటోంది. ఇందులో భాగంగా వరుస సినిమాలని లైన్ లో పెడుతోంది. ప్రస్తుతం నిఖిల్ కి జంటగా ‘శ్వాస’ సినిమాలో నటిస్తోంది. ఈ విషయం పక్కన పెడితే నివేదా ప్రస్తుతం పార్టీ మూడ్ లో ఉంది.

ఆమె సోదరుడి పెళ్లి కుదిరింది. ఇటీవలే ఎంగేజ్ మెంట్ జరిగింది. ఎంగేజ్ మెంట్ వేడుకలో నివేదా డ్యాన్స్ చేసింది. ఇద్దరు సోదరులతో కలిసి ప్రభుదేవా హీరోగా వచ్చిన ‘గులేభకావలి’ సినిమాలోని సాంగ్‌కు నివేదా అదిరిపోయే స్టెప్పులేసింది. దానికి సంబంధించి డ్యాన్స్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ‘మీరు పార్టీని ఎలా ఎంజాయ్‌ చేస్తారా..?’ ‘మీ హీల్స్‌ను విసిరేయండి..వెళ్లి డ్యాన్స్‌చేయండి’ అంటూ నివేదా డ్యాన్స్ వీడియోపై నెటిజర్స్ కామెంట్స్ చేస్తున్నారు.

ఇండస్ట్రీలో గ్లామర్ తో కెరీర్ ని నెట్టుకొచ్చే హీరోయిన్స్ నే ఎక్కువ. అందం+అభినయంతో ఆకట్టుకొన్నే అతికొద్ది మంది హీరోయిన్స్ లో నివేదా ఒకరు. ఆమె తొలి చిత్రం జెంటిల్ మెన్ తోనే లేడీ కమల్ హాసన్ అనిపించుకొన్నారు. నిన్నుకోరి లో నివేదా నటన సూపర్బ్. ఈ నేపథ్యంలోనే ఆమె నటనకి ప్రాధాన్యత ఉన్న పాత్రలకి మంచి ఆప్షన్ గా మారిందని చెబుతున్నారు.