ఎన్టీఆర్ సినిమాలో హన్సిక


పాలబుగ్గల సుందరి హన్సిక ఎన్టీఆర్ సినిమాలో ఛాన్స్ కొట్టేసినట్టు సమాచారమ్. క్రిష్ దర్శకత్వంలో ఎన్టీఆర్ బయోపిక్ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాని స్టార్స్ తో నింపేస్తున్నాడు దర్శకుడు. బసవతారకమ్మగా బాలీవుడ్ నటి విద్యాబాలన్, అతిలోక సుందరి శ్రీదేవిగా రకుల్ ప్రీత్ సింగ్, మహానటి సావిత్రిగా నిత్యామీనన్, సహజనటి జయసుధగా పాయల్ రాజ్ పుత్ లని కనిపించనున్నారు. ఇప్పుడు జయప్రద పాత్ర కోసం హన్సిక ని తీసుకొన్నట్టు సమాచారమ్.

ముందుగా జయప్రద పాత్ర కోసం మిల్కీ బ్యూటీ తమన్నాని అనుకొన్నారంట. ఫైనల్ గా హన్సికని ఫిక్స్ చేశారట. బొద్దుగా ఉండే హన్సిక ఈ మధ్య బరువు తగ్గి సన్నజాజి తీగలా తయారైంది. నిండైన అందాలతో హన్సిక జయప్రద పాత్రకి సరిగ్గా సరిపోతుందని క్రిష్ భావిస్తున్నారంట. త్వరలోనే ఆమె షూటింగ్ లో జాయిన్ కాబోతున్నట్టు సమాచారమ్. ఇన్నాళ్లు కోలీవుడ్ లో హవా చూపించిన హన్సిక.. జోరు అక్కడ కాస్త తగ్గింది. ఈ నేపథ్యంలోనే ఆమె టాలీవుడ్ పై ఫోకస్ చేసింది. ఇందుకు ఎన్టీఆర్ సినిమాయే సరైందని వచ్చిన అవకాశాన్ని రెండు చేతుల్లా అందిపుచ్చుకొందట హన్సిక.

ఇక, ఎన్టీఆర్ బయోపిక్ ని రెండు భాగాలుగా ఎన్టీఆర్ – కథానాయకుడు, ఎన్టీఆర్ – మహానాయకుడుగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. తొలిభాగాన్ని సంక్రాంతి కానుకగా జనవరి 9న విడుదల చేయబోతున్నారు. రెండో భాగాన్ని ఫిబ్రవరిలో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఇందులో తండ్రి ఎన్టీఆర్ పాత్రలో ఆయన తనయుడు బాలకృష్ణ ఒదిరిపోయాడు. ఇప్పటికే బయటికొచ్చిన కొన్ని ఫోటోల్లో అచ్చం ఎన్ టీఆర్ ని చూసినట్టు అనిపిస్తోంది.