మెగా హీరోకి కన్నుకొట్టింది !


ఒక్క కనుసైగతో కావాల్సిన పబ్లిసిటీని తెచ్చుకొంది. రాత్రికే రాత్రే స్టారడమ్ తెచ్చుకొంది.. మలయాళ ముద్దుగుమ్మ ప్రియా ప్రకాష్ వారియర్. ఆ క్రేజే ఆమెని బిజీ చేసింది. ఆమె కోసం దర్శక-నిర్మాతలు క్యూ కడుతున్నారు. టాలీవుడ్ నుంచి ప్రియా కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. గతంలో నిఖిల్ సినిమా కోసం ప్రియాని ట్రై చేశారు. కానీ, వర్కవుట్ కాలేదు. ఇప్పుడు మెగా హీరో కోసం ప్రియాని తీసుకొస్తున్నట్టు సమాచారమ్. చిరు చిన్నల్లుడు ‘విజేత’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే.

కళ్యాణ్ దేవ్ రెండో సినిమా పులి వాసు దర్శకత్వంలో తెరకెక్కనుంది. ఈ సినిమాలో కోసం ప్రియా వారియర్ ని హీరోయిన్ గా అనుకొంటున్నారంట. ఇప్పటికే చిత్రబృందం ఆమెని సంప్రదించింది. ప్రియా కూడా ఓకే చెప్పింది. కాకపోతే కోటి రూపాయల పారితోషికం డిమాండ్ చేస్తున్నట్టు సమాచారమ్. మెగా కాంపౌండ్ లోకి ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ పంటపడినట్టే. ఆమెతో మెగా హీరోలందరూ.. ఓ రౌండ్ వేసే ఛాన్స్ ఉంది.

చరణ్, బన్నీ, వరుణ్, సాయిధరమ్ తేజు.. ఇలా మెగా హీరోలందరి ప్రియా కన్నుకొట్టే ఛాన్స్ కొట్టేయొచ్చు. అదే జరిగితే టాలీవుడ్ లో ప్రియా స్టార్ హీరోయిన్ ఎదగడం ఖాయం. అన్నట్టు.. ఇటీవల అఖిల్ అక్కినేనితో ఓ షాపింగ్ మాల్ యాడ్ లో ప్రియా నటించిన నటించిన సంగతి తెలిసిందే. వీరి జోడీ బాగుందనే కామెంట్స్ వచ్చాయి. ఈ నేపథ్యంలో ప్రియాపై అఖిల్ కన్నేశాడట. మొత్తానికి.. ఈ కన్నుగీత ముద్దుగుమ్మ టాలీవుడ్ ని పడేసింది.