మేరీకోమ్‌ కు మహేష్ సెల్యూట్

భారత దిగ్గజ బాక్సర్‌ మేరీకోమ్‌ ప్రపంచ బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. ఆమె ఏకంగా ఆరో స్వర్ణాన్ని కొల్లగొట్టారు. ఆదివారం 48 కేజీల విభాగం ఫైనల్లో మేరీ.. ఉక్రెయిన్‌ క్రీడాకారిణి హనా ఒఖోటాను 5-0తో మట్టికరిపించింది.

ఈ నేపథ్యంలో ఆమెపై సర్వత్ర ప్రశంసలు కురుస్తున్నాయి. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ఆమెను ప్రశంసల్లో ముంచెత్తారు. ‘అద్భుతమైన విజయం. ఛాంపియన్… నీ విజయాన్ని చూసి గర్విస్తున్నాము. ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ లో ఆరు స్వర్ణాలను గెలుపొందినందుకు అభినందనలు” అని మహేష్ ట్విట్ చేశారు.

35 యేళ్ల మేరీకోమ్ కు ముగ్గురు కుమారులు ఉన్నారు. ఆమె రాజ్యసభ సభ్యురాలిగా కూడా ఉన్నారు. ఆమెను భారత రాష్ట్రపతి నామినేట్ చేసిన సంగతి తెలిసిందే.