ఆ మ్యాజిక్ అద్భుతం అంటున్న బన్నీ

స్టయిలీష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం ఖాళీ. నా పేరు సూర్య తర్వాత బన్నీ మరో సినిమాని మొదలెట్టలేదు. త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కనున్న బన్నీ సినిమా డిసెంబర్ లో ప్రారంభం కానుంది. అప్పటి వరకు బన్నీ ఖాళీయే. ఈ ఖాళీ సమయంలో కుటుంబంతో సరదాగా గడుపుతున్నారు. ఇష్టమైన సినిమాలు చూసేస్తున్నారు బన్నీ.

షారుఖ్ ఖాన్ – కాజోల్ జంటగా నటించిన ‘దిల్ వాలే దుల్హనియా లే జాయేంగే’ మరోసారి చూశారట బన్నీ. 1995లో విడుదలైన ఈ చిత్రం ఓ క్లాసిక్. ఆదిత్య చోప్రా దర్శత్వంలో వచ్చిన చిత్రమిది. ఈ సినిమాపై బన్నీపై తన ఇన్ స్ట్రో గ్రామ్ లో ఆసక్తికరమైన కామెంట్ పెట్టాడు.

‘తొలిసారి ఈ చిత్రాన్ని 1995లో చూశా. ఆ సమయంలో అద్భుతమైన సినిమాటిక్ మ్యాజిక్‌ని, అనుభూతిని అనుభవించా. మళ్లీ ఇప్పుడు 23 ఏళ్ల తరువాత ఈ చిత్రాన్ని చూశా. అదే మ్యాజిక్.. అదే అనుభూతి కలిగిందని బన్నీ తెలిపాడు. అప్పుడు.. ఇప్పుడూ.. ఇంక ఎన్నేళ్ళైనా ఈ చిత్రానికి తిరుగులేదు. నా హృదయం మొత్తం ఈ చిత్రంపై ప్రేమతో నిండిపోయింది’ అని తెలిపారు.