అజరుద్దీన్‌’ని రంగంలోకి దిగిన కాంగ్రెస్

కాస్త ఆలస్యంగా ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన తెలంగాణ కాంగ్రెస్.. అవకాశం ఉన్న ప్రతి మార్గాన్ని ప్రచారం కోసం వినియోగించుకుంటోంది. ఇందులో భాగంగా తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంటు రేవంత్ రెడ్డికి విమానాన్ని సమకూర్చింది. అత్యంత వేగంగా సాధ్యమైనన్నీ.. ఎక్కువ నియోజకవర్గాల్లో రేవంత్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించేందుకు ఈ వసతి కల్పించింది

ఇప్పుడు మాజీ క్రికెటర్‌, కాంగ్రెస్‌ నాయకుడు అజరుద్దీన్‌ ని ఎన్నికల ప్రచారంలోకి దించింది. అజర్ నేడు నల్గొండ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ముస్లిం ఓటర్లు అధికంగా ఉండే నల్గొండలో అజర్ ప్రచారం తమకు కలిసొస్తుందని కాంగ్రెస్ భావిస్తోంది. నల్గొండ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా కోమట్ రెడ్డి వెంకట్ రెడ్డి బరిలో ఉన్నారు.