బ్రేకింగ్ : బాల సాయిబాబా కన్నుమూత
కర్నూలు బాల సాయిబాబా (59) కన్నుమూశారు. ఆయన అనారోగ్యంతో హైదరాబాద్ లోని విరించి ఆసుపత్రిలో చేరారు. ఈ ఉదయం గుండెపోటుతో మృతి చెందినట్టు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.
1960సం॥ జనవరి 14న బాలసాయి కర్నూలులో జన్మించారు. మహాశివరాత్రి పర్వదినాన నోటి నుంచి శివలింగాలు తీయడం బాలసాయి ప్రత్యేకత. 18యేళ్ల వయసులోనే కర్నూల్లో తొలి ఆశ్రమాన్ని ఏర్పాటు చేశారు. కర్నూలు, హైదరాదాద్ లోనూ బాలసాయి ఆశ్రమాలు నడుపుతున్నారు. కర్నూలు ప్రాంతంలో బాలసాయి పేరిట ఎన్నో సేవా కార్యక్రమాలు సాగుతున్నాయి.
బాలసాయిపై పలు ఆరోపణలు కూడా ఉన్నాయి. ఆయన గుప్త నిధుల తవ్వకాలు, భూమిని ఆక్రమించారని ఆరోపణలు ఎదురుకొన్నారు. ఐతే, ఆయన ప్రవచనాలు భక్తులని విశేషంగా ఆకట్టుకొనేవి. బాలసాయి మరణంతో ఆయన భక్తులు కన్నీరుమున్నీరు అవుతున్నారు.