ఎన్టీఆర్ మాస్, చరణ్ మోడ్రన్ లుక్ లో !


రాజమౌళి మల్టీస్టారర్ #RRR షూటింగ్ మొదలైపోయింది. ఫస్ట్ షెడ్యూల్ లోనే తారక్, చరణ్ ఇద్దరూ షూటింగ్ లో పాల్గొంటున్నారు. సినిమాలో వీరిద్దరు డిఫరెంట్ లుక్ లో కనిపించబోతున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు వీరి లుక్ లకి సంబంధించిన న్యూస్ సెట్స్ నుంచి లీకైంది. సినిమాలో ఎన్టీఆర్ మాస్ పాత్రలో నటిస్తున్నారట. దానికి తగ్గట్టుగానే పఠాన్ దుస్తులు ధరించి గుబురు గడ్డంతో ఓ కొత్త లుక్‌తో షూటింగ్‌లో పాల్గొంటున్నారు.

చరణ్ మాత్రం మోడ్రన్ గా కనిపిస్తున్నారంట. ఆధునికత ఉట్టిపడేలా దుస్తులు ధరించి ఇటీవల షూటింగ్‌లో చరణ్ షూటింగ్ లో పాల్గొంటున్నారు. ఇప్పటికే చరణ్ పై కొన్ని సీన్లను చిత్రీకరించినట్టు తెలిసింది. మొత్తంగా తారక్ మాస్ పాత్రలో, చరణ్ మోడ్రన్ పాత్రలో కనిపించబోతున్నారు. ఐతే, ఈ మాస్, మోడ్రన్ పాత్రలకి లింకు ఎక్కడ కుదిరింది అనేది మాత్రం సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. బాహుబలి తర్వాత రాజమౌళి చేస్తున్న సినిమా కావడంతో #RRR పై భారీ అంచనాలున్నాయి.

అందుకు తగ్గట్టుగానే బాహుబలి రేంజ్ లో #RRR ని తెలుగు, తమిళ్, హిందీ బాషల్లో విడుదల చేయడానికి ప్లాన్ చేసుకొంటున్నారు. దాదాపు రూ. 300కోట్ల భారీ బడ్జెట్ తో సినిమాని ప్లాన్ చేసినట్టు తెలిసింది. హీరోయిన్స్ గా రష్మిక మందన, కీర్తి సురేష్ పేర్లు వినిపిస్తున్నాయి. బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ కోసం కూడా రాజమౌళి ప్రయత్నాలు చేస్తున్నారంట. మొత్తానికి.. రాజమౌళి దేశం గర్వించదగ్గ మరో సినిమా తీసుకొచ్చే ప్రయత్నంలో ఉన్నట్టు తెలుస్తోంది.