దారుణం : అప్పుడే ‘2.ఓ’ హెచ్‌డీ ప్రింట్ లీక్
ఎన్ని ప్రయత్నాలు చేసినా, ముందుస్తు జాగ్రత్తలు తీసుకొన్న ‘2.ఓ’ పైరసీ కాకుండా ఆపలేకపోయారు. తమిళ్ రాకస్ అనుకొంత పని చేసింది. తొలి ఆట ముగియకముందే ఆన్‌లైన్ లో 2.ఓ సినిమాను లీక్ చేసింది తమిళ రాకర్స్. అది కూడా హై క్వాలిటీ హెచ్‌డీ ప్రింట్ ని లీక్ చేసింది. దీనిపై చిత్రబృందం ఆందోళన చెందుతోంది. భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకొచ్చిన ‘2.ఓ’ ఆ అంచనాలనిమించేలా ఉందనే టాక్ తెచ్చుకొంది. మెగా బ్లాక్ బస్టర్ హిట్ ఖాయమని చెబుతున్నారు. తొలిరోజు కలెక్షన్స్ అదిరిపోయాయ్. ఐతే, సినిమా లీకుతో.. అది కలెక్షన్స్ పై తీవ్ర ప్రభావం చూపే అవకాశాలున్నాయి.
పైరసీ విషయంపై 2.ఓ చిత్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ ముందుగానే మద్రాస్ హైకోర్టుని ఆశ్రయించింది. అక్రమంగా పోస్ట్ చేసే డౌన్ లోడింగ్ లింకులపై ఉక్కుపాదం మోపేందుకు కోర్టు నుంచి అనుమతి తీసుకొన్నారు. 10మందితో బలమైన టెక్నికల్ టీమ్‌ను ఏర్పాటు చేసింది. దాదాపు 12 వేల వెబ్‌సైట్లను బ్లాక్ లిస్టులో పెట్టేందుకు ప్లాన్ చేశారు. థియేటర్స్ లోనూ లీక్ కాకుండా జాగ్రత్తలు తీసుకొన్నారు. అయినా.. తమిళ్ రాకర్స్ అనుకొంత పని చేసింది. 2.ఓ ని లీక్ చేసి మరోసారి పైత్యాన్ని చూపించింది. మరీ.. ఈ పైరసీ సమస్యని లైకా ప్రొడక్షన్ ఎలా ఎదుర్కొంటున్నది అనేది చూడాలి.
ఇక, శంకర్ దర్శకత్వంలో 2.ఓ తెరకెక్కింది. సూపర్ స్టార్ రజనీకాంత్, బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్, అమీ జాక్సన్ కీలక పాత్రల్లో నటించారు. నాలుగేళ్ల పాటు శ్రమించి.. దాదాపు 600కోట్ల భారీ బడ్జెట్ తో 2.ఓ ని తెరకెక్కించారు. 3జీ టెక్నాలజీ, 4డి సౌండ్ ప్రేక్షకుల ముందుకొచ్చిన తొలి భారతీయ సినిమా 2.ఓ కావడం విశేషం.