కేసీఆర్’పై మూకుమ్మడి దాడి

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై మూకుమ్మడి దాడి జరుగుతోంది. ఆయనపై మహాకూటమి పార్టీలు దాడిని ముమ్మరం చేశాయి. తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డి.. ఇతర నేతలు టీఆర్ఎస్, కేసీఆర్ పై ఓ రేంజ్ లో విమర్శలు చేస్తున్నారు. మరికొద్ది రోజుల్లో కేసీఆర్ పీడ విరగడైపోతుందని చెబుతున్నారు. వీరికి తోడుగా టీజెఎస్ అధినేత కోదండరామ్, ప్రజా యుద్దనౌక గద్దర్ కేసీఆర్ పై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. కేసీఆర్ కుటుంబ పాలనకి అంతం పలకాలని పిలుపునిస్తున్నారు.

కేసీఆర్ ని ఢీకొట్టడంలో లోకల్ లీడర్స్ వల్ల కావడం లేదు. ఈ విషయాన్ని గమనించి జాతీయనేతలు రంగంలోకి దిగుతున్నారు. జాతీయ కాంగ్రెస్ అధ్యక్షడు రాహుల్ గాంధీ ప్రస్తుతం తెలంగాణ పర్యటనలో ఉన్నారు. ఆయన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు డైరెక్షన్ లో కేసీఆర్ పై విమర్శలకి పదనుపెడుతున్నారు. ఇన్నాళ్లు ఏపీ నుంచే కేసీఆర్ నే టార్గెట్ చేసిన చంద్రబాబు కూకట్ పల్లిలో ఎన్నికల ప్రచారలో టీఆర్ ఎస్ పై కత్తులు దూస్తున్నారు. మొత్తంగా.. కేసీఆర్ పై మూకుమ్మడి దాడి జరుగుతోంది.క్

ఇక, ఈ ఎన్నికల్లో ఓడిపోయి ఫాంహౌస్ కు వెళుతున్న కేసీఆర్ ను మళ్లీ ఓటేసి పిలవొద్దని తెలంగాణ ప్రజలకు కోదండరాం విజ్ఞప్తి చేశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఈ రోజు నిర్వహించిన మహాకూటమి సభలో కోదండరాం మాట్లాడారు.

ఓపెన్ కాస్ట్ బొగ్గు గనులతో సామాన్యులతో పాటు కార్మికులు, రైతుల జీవితాలను కేసీఆర్ ప్రభుత్వం నాశనం చేసిందని ఆయన మండిపడ్డారు. సింగరేణి కార్మికులకు న్యాయం చేస్తామని చెప్పిన కేసీఆర్..గత నాలుగున్నరేళ్లుగా ఒక్క సమస్యను కూడా పరిష్కరించలేదని విమర్శించారు. రాష్ట్రంలో కౌలు రైతు అన్నవాడు అసలు రైతే కాదన్నట్లు ముఖ్యమంత్రి వ్యవహారశైలి ఉందని దుయ్యబట్టారు.