వైరల్ : రషీద్‌ ఖాన్ హెలికాఫ్టర్‌ షాట్


టీ10లీగుల్లో ఓ హెలికాఫ్టర్‌ షాట్ హలైట్ గా నిలిచింది. ఐతే, అది కొట్టింది మన ధోని కాదు. ధోని కాకుండా అంత అద్భుతంగా హెలికాఫ్టర్‌ షాట్ ఆడిన ఆటగాడు ఎవరు అనుకొంటున్నారా ? అతడు మరెవరో కాదు ఆఫ్ఘనిస్తాన్‌ స్పిన్సర్‌ రషీద్‌ ఖాన్. టీ10లీగుల్లో భాగంగా రషీద్‌ ఖాన్‌ కొట్టిన హెలికాప్టర్‌ షాట్‌ను చూసి అక్కడ కోచ్‌లు సైతం నివ్వెరపోయారు. ఆ షాట్ సంబంధించిన వీడియోని రషీద్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశాడు. ఇప్పుడీ వీడియో వైరల్ గా మారింది. మీరు.. రషీద్ హెలికాఫ్టర్‌ షాట్ ని చూసేయండీ.. !