చరణ్ ఐటమ్ లిస్టులో మరో హీరోయిన్ !

రామ్ చరణ్ ఐటమ్ లిస్టులో మరో హీరోయిన్ చేరింది. బోయపాటి దర్శకత్వంలో రామ్ చరణ్ ‘వినయ విధేయ రామ’ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. కైరా అద్వానీ హీరోయిన్. ఇందులో అదిరిపోయే ఐటమ్ సాంగ్ ని ప్లాన్ చేశారట. ఈ ఐటమ్ కోసం ఇలియానాని సంప్రదించింది చిత్రబృందం. ఆమె రూ. 60లక్షల పారితోషికం డిమాండ్ చేయడం చేసినట్టు ప్రచారం జరిగింది.

ఇల్లీకి అంత రేటు ఇచ్చేందుకు చిత్రబృందం సుముఖంగా లేదు. ఈ నేపథ్యంలో మరో హాట్ బ్యూటీ కోసం వెతుకుతున్నారు. ఈ క్రమంలో యంగ్ హీరోయిన్ క్యాథరిన్ థ్రెసా పేరు తెరపైకి వచ్చింది. బోయపాటి ‘సరైనోడు’ క్యాథరిన్ హీరోయిన్ గా నటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బోయపాటి అడగ్గానే క్యాథరిన్ ఓకే చెప్పినట్టు సమాచారమ్.

ఇక, చరణ్ ఐటమ్ కోసం చాలా పేర్లు వినిపించాయి. రకుల్ ప్రీత్ సింగ్, కాజల్, పాయల్ రాజ్ పుత్, ఇలియానా పేర్లు చరణ్ ఐటమ్ గా మారబోతున్నట్టు ప్రచారం జరిగింది. ఇప్పుడు క్యాథరిన్ దగ్గరకి వచ్చింది. మరీ.. చరణ్ ఐటమ్ గా క్యాథరిన్ ఫిక్సవుతుందా.. ? లేక చరణ్ ఐటమ్ లిస్టులో మరికొందరి పేర్లు వచ్చి చేరుతాయా.. ?? అన్నది చూడాలి.