హైకోర్టులో నాగంకు షాక్

నాగర్ కర్నూల్ కాంగ్రెస్ అభ్యర్థి, సీనియర్ నేత నాగం జనార్థన్ రెడ్డికి హైకోర్టు షాక్ ఇచ్చింది. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై ఆయన దాఖలు చేసిన పిటిషన్ ని కోర్టు కొట్టేసింది. ఈ ప్రాజెక్టు నిర్మాణంలో భారీ ఎత్తున అవినీతి జరుగుతుందని ఆరోపిస్తూ నాగం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై కొద్దిరోజులుగా విచారణ జపురుతున్న న్యాయస్థానం తాజాగా తీర్పుని వెల్లడించింది. ప్రాజెక్టు నిర్మాణంలో అన్నీ సక్రమంగానే ఉన్నాయని కోర్టు అభిప్రాయపడింది. ఈ ప్రాజెక్టు ద్వారా 5లక్షల ఎకరాలకి నీళ్లు అందనున్నాయి. ఈ ప్రయోజిత ప్రాజెక్టుని పూర్తి చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయడింది.

ఎన్నికలకి మరో నాలుగు రోజులు మాత్రమే సమయం ఉన్న నేపథ్యంలో వచ్చిన ఈ తీర్పు టీఆర్ఎస్ కు అనుకూలంగా మారనుంది. నాగం మాత్రం ఇది పెద్ద షాక్ అనే చెప్పాలి. టీడీపీని వీడిన తర్వాత నాగం రాజకీయపరిస్థితి ఏమాత్రం బాగులేదు. కొన్నాళ్ల పాటు బీజేపీలో చేరిన నాగం ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ప్రస్తుతం నాగర్ కర్నూలు కాంగ్రెస్ అభ్యర్థిగా నాగం బరిలో ఉన్నారు.