‘పేట్టా’ మాస్ సాంగ్ విన్నారా ?

కార్తిక్‌ సుబ్బరాజ్‌ దర్శకత్వంలో రజనీకాంత్‌ ‘పేట్టా’ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. రజనీ సరసన త్రిష జతకట్టనుంది. మరో కీలక పాత్రలో సీనియర్ హీరోయిన్ సిమ్రాన్ నటిస్తున్నారు. ఇందులో విజయ్‌సేతుపతి, నవాజుద్దీన్ సిద్ధిఖీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. వచ్చే యేడాది సంక్రాంతి కానుకగా ‘పేట్టా’ని ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నారు.

తాజాగా, ఈ సినిమా నుంచి మాస్ లిరికల్ సాంగ్ ని విడుదల చేశారు. వివేక్ రాసిన ఈ సాంగ్ ని ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, అనిరుధ్ కలిసి పాడారు. ఈ మాస్ సాంగ్ అదిరిపోయింది. సూపర్ స్టార్ అభిమానులకి పూనకం తెచ్చేలా ఉంది. ఇక, ఈ సినిమా నుంచి మరో పాటని ఈ నెల 7న విడుదల చేయబోతున్నారు. ఈ నెల 9న సినిమా ఆడియో వేడుకని ఘనంగా నిర్వహించబోతున్నారు. ప్రస్తుతానికైతే పేట్టా మాస్ సాంగ్ ని చూసి విని ఎంజాయ్ చేయండీ.. !