‘నెక్ట్స్ ఏంటీ’ ప్రీ-రిలీజ్ వేడుక ఎక్కడ.. ఎప్పుడు ?

ఈ వారం ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సినిమాలో ‘నెక్ట్స్ ఏంటీ’ ఒకటి. సందీప్ కిషన్ – తమన్నా జంటగా నటిస్తున్న రొమాంటిక్ ఎంటర్ టైనర్ ఇది. బాలీవుడ్ దర్శకుడు కునాల్‌ కోహ్లీ దర్శకత్వం వహిస్తున్నారు. నవదీప్, పూనమ్ కౌర్‌ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్ లో సందీప్-తమ్మూల రొమాన్స్ హైలైట్ గా నిలిచింది. ఈ మధ్య బోల్డ్ కంటెంట్ సినిమాలకి మంచి ఆదరణ లభిస్తోంది. ‘నెక్ట్స్ ఏంటీ’ కూడా దాదాపు ఆ రేంజ్ సినిమా అనే విషయం టీజర్ తో అర్థమైంది.

ఈ సినిమా ప్రీ-రిలీజ్ వేడుకకి ముహూర్తం ఫిక్సయ్యింది. రేపు (డిసెంబర్ 4) సాయంత్రం హైదరాబాద్ లోని దస్ పల్లా హోటల్ ప్రీ-రిలీజ్ వేడుక జరగనుంది. ఈ విషయాన్ని తెలుపుతూ చిత్రబృందం ఓ పోస్టర్ ని విడుదల చేసింది. ఈ వేడుకలో సందీప్ కిషన్ – తమన్నాల రొమాన్స్ పై మరింత సమాచారం ఇవ్వనుంది చిత్రబృందం. ఐతే, ఈ వయసులోనూ యంగ్ హీరో సందీప్ తో తమ్మూ పోటీపడి రొమాన్స్ చేయడం సినిమాలో హైలైట్ గా నిలవనుందని చెబుతున్నారు.