చరణ్ ఫ్యామిలీ సాంగ్ వచ్చేసింది !

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు మాస్-యాక్షన్ కొట్టిన పిండి. లవ్వర్ బోయ్ గానూ ఫర్వాలేదు. ఎటొచ్చి ఫ్యామిలీ హీరో అనిపించుకోవాలన్నది చరణ్ కోరిక. అది ‘రంగస్థలం’తో కొంత వరకు తీరింది. ఇందులోనూ ఊరమాస్ చిట్టిబాబు పాత్రలో అదరగొట్టాడు. ఆ పాత్ర చుట్టూ ఫ్యామిలీ ఎలిమెంట్స్ బలంగా కనిపించాయి. ప్రస్తుతం బోయపాటి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న రామ్ చరణ్ ‘వినయ విధేయ రామ’ ఈ కోవకు చెందినదే. ఇది బోయపాటి మార్క్ మాస్-యాక్షన్ ఎంటర్ టైనర్. దాంతో పాటు ఫ్యామిలీ ఎలిమెంట్స్ ఉండనున్నాయి. తాజాగా, ఈ సినిమా నుంచి తొలి పాటగా ఫ్యామిలీ సాంగ్ ని విడుదల చేసింది చిత్రబృందం

‘తందానే తందానే.. ‘ అంటూ సాగే ఫ్యామిలీ సాంగ్ ని శ్రీమణి రాశారు. ఎంఎల్ఆర్ కార్తికేయన్ పాడారు. ఈ సాంగ్ లో రామ్ చరణ్ ఫ్యామిలీ మొత్తం కనిపిస్తోంది. సీనియర్ హీరోలు ప్రశాంత్, ఆర్యన్ రాజేష్.. తదితరులు కనిపిస్తున్నారు. తెర మీద పండగ వాతావరణం కనిపిస్తోంది. హీరోయిన్స్ కైరా అద్వానీ మాత్రం పాటలోనూ గ్లామర్ గానే కనిపించింది. దీంతో ఆమెది సినిమాలో గ్లామర్ రోల్ అని అర్థమవుతోంది. ఇక, ఈ సినిమాని వచ్చే యేడాది సంక్రాంతి కానుకగా విడుదల చేయబోతున్నారు. సంక్రాంతి రేసులో చరణ్ సినిమకి పోటీగా ఎన్ టీఆర్ బయోపిక్ రాబోతున్న సంగతి తెలిసిందే.