రేవంత్ రెడ్డి అరెస్టుపై హైకోర్టులో పిటిషన్ !
తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంటు రేవంత్ రెడ్డి అరెస్టుతో కొడంగల్ లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రేవంత్ రెడ్ది ఇంటివైపు ఎవరిని కూడా వెళ్లకుండా పోలీసులు అడ్డుకొంటున్నారు. రేవంత్ అరెస్ట్ పై కాంగ్రెస్ శ్రేణులు మండిపడుతున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ హైకోర్టును ఆశ్రయించింది. రేవంత్ ను వెంటనే విడుదల చేయాలి. ఆయన ఎక్కడున్నారో చెప్పాలంటూ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ కోర్టు స్వీకరించింది. ఈ మధ్యాహ్నం పిటిషన్ ని విచారించనుంది. ఈ నేపథ్యంలో రేవంత్ అరెస్టుపై కోర్టు ఏ తీర్పుస్తుందన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది.
మరోవైపు, కొడంగల్ లోని కోస్గీలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజాఆశీర్వాద సభను అడ్డుకుంటామని ప్రకటించడంతో రేవంత్ ను అరెస్ట్ చేశామని పోలీసులు శ్రేణులు చెబుతున్నాయి. ఐతే, ఆ అరెస్ట్ చేసే పద్దతిపై తీవ్ర నిరసన వ్యక్తం అవుతోంది. 144 సెక్షన్ అమలు ఉండగా.. అంతమంది పోలీసులు రేవంత్ రెడ్డి ఇంట్లోకి ఎందుకు వచ్చినట్టు ? ఏకంగా రేవంత్ బెడ్ రూంలోకి వెళ్లడం వివాదాస్పందంగా మారింది. అరెస్ట్ చేసిన తర్వాత రేవంత్ రెడ్డిని ఎక్కడికి తరలించారనే విషయాన్ని చెప్పకపోవడంపై కూడా మండిపడుతున్నారు. కోర్టులో ఈ ప్రశ్నలన్నింటికి పోలీసులు సమాధానం చెప్పాల్సి ఉంటుందని చెబుతున్నారు.