తెలంగాణ రెండో ముఖ్యమంత్రి సర్వే !
తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ పనిచేశారు. ఈ దఫా ఎన్నికల్లో మరోసారి తెరాస జయకేతం ఎగరవేసి.. మళ్లీ కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారా ? అన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది. తెరాస గెలిస్తే కేసీఆర్ నే మళ్లీ ముఖ్యమంత్రి. అందులో నో డౌటు. తెరాస కాకుండా కాంగ్రెస్ సారధ్యంలోని ప్రజాకూటమి అధికారంలోకి వస్తే.. ఎవరు ముఖ్యమంత్రి ఎవరు అవుతారు ? పోటీలో ఓ 20మంది నేతలున్నారు. సీఎం కుర్చీ కోసం పిచ్చి కుక్కల్లా కొట్లాడతరు అనే ప్రచారాన్ని కేసీఆర్ చేస్తున్నారు.
ఇందులో నిజం లేకపోలేదు. ఐతే, తెలంగాణ రాష్ట్ర రెండో ముఖ్యమంత్రి తానే అంటున్నాడు సర్వే సత్యనారాయణ. టీఆర్ఎస్ అధికారంలోకి వస్తే దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని హామీ ఇచ్చిన కేసీఆర్ మాటతప్పారు. ఒకవేళ కాంగ్రెస్ అధిష్టానం దళితుడుని సీఎం చేస్తానంటే తనకు ఆ అవకాశం వస్తుందని చెబుతున్నడు. తనకి తాను సోనియాగాంధీకి వీర విధేయుడినని, ఆమెకు దత్తపుత్రుడినని చెప్పుకునే సర్వే సీఎం అవుతాడేమో చూడాలి.. మరీ.. !