ఎన్టీఆర్ పొలిటికల్ సాంగ్ వచ్చేస్తోంది !
ఎన్టీఆర్ జీవిత కథని రెండు భాగాలుగా తీసుకొన్నారు దర్శకుడు క్రిష్. తొలి భాగం ‘ఎన్టీఆర్-కథానాయకుడు’గా రాబోతుంది. ఇందులో ఎన్టీఆర్ సినీ జీవిత విశేషాలని చూపించబోతున్నారు. వచ్చే యేడాది సంక్రాంత్రి కానుకగా జనవరి 9న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా ప్రమోషన్స్ కార్యక్రమాలని చిత్రబృందం ఇప్పటికే ప్రారంభించింది. ఇందులో భాగంగా ఎన్టీఆర్ తొలి పాటని విడుదల చేశారు. శుద్ధ వ్యావహారిక పదాలతో కూడి, నటుడిగా ఎన్టీఆర్ ఘనకీర్తిని కీర్తిస్తూ సాగే పాట ఇది. దీన్ని సంగీత దర్శకుడు కీరవాణి తండ్రి శివశక్తి దత్త రాశారు. ఈ పాటకు విశేష స్పందన వస్తోంది. ఎన్టీఆర్ రెండో పాట కూడా త్వరలోనే రాబోతుంది.
రెండో భాగం ‘ఎన్టీఆర్ – మహానాయకుడు’లోని ఓ పాటను త్వరలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. రాజకీయనాయకుడిగా ఎన్టీఆర్ కీర్తిని, ఆయన విజయాలను గుర్తు చేస్తూ సాగే పాట ఇదని చెబుతున్నారు. రెండు భాగాలకు కలిపి ఒకటే ఆడియోగా అందించనున్నారు. మొత్తం సినిమాలో 11 పాటల్లో ఉండనున్నాయి. ఇవేగాక సినిమాలో రెండు మెడ్లీలు వుంటాయని తెలుస్తోంది. ఎన్టీఆర్ సినిమాల్లోని పలు పాటల పల్లవులు జస్ట్ కట్ చేసి, రెండు మెడ్లీలుగా రూపొందించారట.
ఎన్టీఆర్ బయోపిక్’లో దర్శకుడు క్రిష్ ప్రతి పాత్ర కోసం బలమైన లైన్లు రాసుకొన్నాడట. ఎన్టీఆర్ గా ఆయన తనయుడు బాలకృష్ణ నటిస్తున్నారు. ఆయన సతీమణి పాత్రలో బాలీవుడ్ నటి విద్యాబాలని కనిపిస్తారు. రకుల్ ప్రీత్ సింగ్, నిత్యామీనన్, పాయల్ రాజ్ పుత్, హన్సిక, రానా దగ్గుపాటి, సుమంత్.. తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.