సామ్ కొత్త ఫోటోలు.. చూశారా ?
‘ఆమె కళ్లతో చంపేస్తోంది. క్యూట్ నవ్వుతో ఆకర్షిస్తోంది. ఆమె మేజిక్ కి అమ్మాయిలందరు ఫిదా అయిపోతున్నారు. ఆమెతో ప్రేమలో పడిపోతున్నారు’. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా ? మన సామ్.. సమంత. ఆమె కొత్త ఫోటోలని ట్విటర్ లో పంచుకొంటూ సినీ జర్నలిస్ట్ శ్రీదేవి శ్రీదర్ పెట్టిన కామెంట్ ఇది. దీనికి సామ్ కూడా ఫిదా అయిపోయింది. థ్యాంక్స్ చెబుతూ రీట్విట్ చేసింది సామ్. ఇక, కొత్త ఫోటోస్ లో సామ్ హాట్ హాట్ గా కనిపిస్తోంది.
ఈ యేడాది సమంత ఖాతాలో వరుస బ్లాక్ బస్టర్ హిట్స్ పడ్డాయి. రంగస్థలం, మహానటి, అభిమన్యుడు, యూటర్న్ సినిమాలు పెద్ద విజయాన్ని నమోదు చేశాయి. ప్రస్తుతం సామ్ భర్త నాగచైతన్య తో కలిసి ‘మజిలీ’ సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి శివ నిర్మాణ దర్శకత్వం వహిస్తున్నారు. పెళ్లి తర్వాత సామ్-చై కలిసి నటిస్తున్న తొలి చిత్రమిది. సినిమాలో భార్యభర్తలుగా కనిపించబోతున్నారు.
You kinda made my morning
Thankyou Sri
Lots of love https://t.co/rnDlivOF2y
— Samantha Akkineni (@Samanthaprabhu2) December 6, 2018