ప్రభాస్’తో జూ. ప్రభాస్ భేటీ వెనక !


కన్నడ సూపర్ స్టార్ యశ్ పై జూనియర్ ప్రభాస్ అనే ముద్రపడిపోయింది. ఆయన కటౌట్ ప్రభాస్ పోలి ఉండటం మాత్రమే కాదు.
నటనలోనూ ఆయనకి ప్రభాస్ కి దగ్గరపోలికలు ఉన్నాయని చెప్పుకొంటుంటారు. ఇప్పుడీ కన్నడ యంగ్ హీరో పేరు రాజమౌళి మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’ కోసం వినిపిస్తోంది. ఇందులో యశ్ విలన్ పాత్రలో కనిపించబోతున్నట్టు ప్రచారం జరుగుతోన్న సంగతి తెలిసిందే. దీనిపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ఐతే, ఇటీవల ముంబైలో ప్రభాస్-యశ్ లు భేటీ కావడం హాట్ టాపిక్ గా మారింది.

ఈ భేటీ ప్లాన్ ప్రకారం జరిగింది మాత్రం కాదట. యశ్ తాజా చిత్రం ‘కేజీఎఫ్’. ఈ సినిమాని హిందీలోనూ విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్ కోసం యశ్ ముంబై వెళ్లారు. ఇక, ప్రభాస్ సాహో షూటింగ్ ప్రస్తుతం ముంబైలో జరుగుతోంది. అక్కడ అనుకోకుండా ప్రభాస్, యశ్ లు కలిసినట్టు తెలుస్తోంది. వీరిద్దరి మధ్య చాలా విషయాలు చర్చకు వచ్చాయట. ఈ సందర్భంగా.. కేజీఎఫ్ సినిమాపై పెరిగిన అంచనాలను ప్రభాస్ ప్రస్తావించడట. ‘కేజీఎఫ్‌’కు సహకారం అందించాలని యశ్ కోరగా.. ప్రభాస్ ఓకే చెప్పినట్టు సమాచారమ్.